చిరంజీవిని టార్గెట్ చేసిన మోహన్ బాబు..ఆయన మాటలు విని ఖయ్యానికి కాలు దువ్వుతున్నాడు.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ కాలం టాప్ ప్లేస్‌లో కొనసాగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. తక్కువ కాలంలోనే బడా హీరోలతో పోటీ పడే స్థాయికి ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో హోదాను అందుకున్నారు.

కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన చిరు.. 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు రూపంలో చిరంజీవికి కష్టాలు మొదలయ్యాయి. ఈ మధ్య ఎంతో సరదాగా కనిపించిన ఇద్దరు దిగ్గజాలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది.? వివరాల్లోకి వెళితే...

కమ్‌బ్యాక్ అదిరింది.. రెండోదో నిరాశ పరిచింది

కమ్‌బ్యాక్ అదిరింది.. రెండోదో నిరాశ పరిచింది

చిరంజీవి కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్లనూ రాబట్టింది. అయితే, దీని తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఫలితంగా నిర్మాత రామ్ చరణ్ నష్టాలను ఎదుర్కోవల్సి వచ్చింది.

ఈ సారి గట్టిగా కొట్టాలని ఆయనతో కలిశాడు

ఈ సారి గట్టిగా కొట్టాలని ఆయనతో కలిశాడు

భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ‘సైరా' సినిమా నిరాశను మిగల్చడంతో మెగా కాంపౌండ్‌లో నిరుత్సాహం కనిపించింది. ఈ క్రమంలో మెగాస్టార్.. బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అలాగే, మ్యాట్నీ మూవీస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

 ఆయనదే.. చిరంజీవి మీద అప్లై చేస్తున్నాడు

ఆయనదే.. చిరంజీవి మీద అప్లై చేస్తున్నాడు

కొరటాల శివ సినిమాలు అంటే సామాజిక అంశాల మేళవింపుతో ఉంటాయి. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక మెసేజ్‌తో వచ్చింది. అలాగే, ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమాలోనూ అదే తరహా ప్రయత్నం చేస్తున్నాడట ఈ బడా డైరెక్టర్. మెగాస్టార్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ బలమైన సామాజిక కోణాలున్న కథను సిద్ధం చేశాడని ప్రచారం జరుగుతోంది.

ఆ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి న్యూ రికార్డ్

ఆ విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి న్యూ రికార్డ్

ఈ సినిమాకు గానూ మెగాస్టార్ చిరంజీవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనికి చరణ్‌తో మ్యాట్నీ మూవీస్ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. మొత్తంగా చిరు ఈ మూవీకి రూ. 50 కోట్లు చార్జ్ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఉన్న హీరోలతో పోలిస్తే ఇది కొత్త రికార్డు అంటున్నారు.

మొదట అనుకున్నది కాదు.. అందుకే అలా

మొదట అనుకున్నది కాదు.. అందుకే అలా

ఈ సినిమాకు మొదట ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ అనుకున్నారు. దీనికి కారణం ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణ చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా టైటిల్‌గా దానిని తీసేశారని అంటున్నారు. ఇటీవల జరిగిన ప్రారంభోత్సవంలో క్లాప్ బోర్డ్‌పై ఆ టైటిల్ కనపడకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చిరంజీవి పాలిట విలన్‌ అవుతున్న మోహన్ బాబు

చిరంజీవి పాలిట విలన్‌ అవుతున్న మోహన్ బాబు

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో సీనియర్ యాక్టర్ మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా ముగిసిందని అంటున్నారు. కొరటాల క్రియేట్ చేసిన ఈ పాత్ర ఆయన గత సినిమాల్లోని విలన్లను గుర్తు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ జంట పోరాటాన్ని తెరపై చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X