లక్ష్మి ప్రసన్న చేసే పనులపై మోహన్ బాబు మండిపాటు!?
పద్మశ్రీ మోహన్ బాబు 1982 లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి దాదాపు 56 సినిమాల దాకా నిర్మించారు. అయితే రీసెంట్ గా ఆయన కుమారుడు మంచు విష్ణు వర్ధన్ 24 ఫ్రేమ్స్ పేరుతో మరో బ్యానర్ ప్రారంభించి వస్తాడు నా రాజు చిత్రం నిర్మించాడు. అది పెద్ద ప్లాపై కూర్చుంది. ఇప్పుడు తన సోదరుడు రూటులోనే వెళ్ళి లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రారంభించి మంచు మనోజ్ హీరోగా ఊ కొడతారా..ఉలిక్కి పడతారా అనే చిత్రం ప్రారంబించింది.రాజా అనే దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం కామిక్ ధ్రిల్లర్ అని చెప్తున్నారు.
ఇక ఇలా ఉంటే ఎవరికి వారు కుటుంబంలోంచి సొంతంగా వేరు వేరు బ్యానర్స్ పెట్టుకోవటం మోహన్ బాబుకు అస్సలు నచ్చటం లేదుట. సినిమాలు తనకు అచ్చివచ్చిన లక్ష్మి ప్రసన్న బ్యానర్ పైనే చేస్తే బావుంటుందని ఆయన భావిస్తున్నారుట. అయితే ఆ బ్యానర్ లో సినిమా చేస్తే తమ తండ్రి ఇన్వాల్వమెంట్ ఎక్కువగా ఉంటుందని భావించిన వీరు క్రియేటివ్ స్వేచ్చ పేరుతో ఇలా వేరు వేరు కుంపట్డు పెట్టుకుంటున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అయితే ఈ రెండు బ్యా నర్స్ కీ మోహన్ బాబు పేరునే సమర్పకుడుగా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











