మోహన్ బాబుకు కూతురు లక్ష్మిప్రసన్నతో విభేదాలా.!?
మోహన్ బాబు మక్కోపి అయినా మంచి వాడుగా ఫిలిం పరిశ్రమలో చాలా పేరుంది. అన్న ఎన్టీఆర్ను చూసి మోహన్ బాబు కూడా సినిమలోనూ, జీవితంలోనూ క్రమశిక్షణ నటుడిగా మనిషిగా కొనసాగారు. మోహన్ బాబు తన పిల్లల్ని కూడా ఎంతో క్రమశిక్షణతో పెంచారు. విష్ణు, మనోజ్ హీరోలుగా, మంచు లక్ష్మి నిర్మాతగా 'మోహన్ బాబు" ఆధ్వర్యంలో మొన్నటి వరకు నడిచారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్టు కనబడుతుంది. రీసెంట్ గా 'ఊ కొడతారా..ఉలిక్కిపడతారా" అనే సినిమాలో నందమూరి బాలకృష్ణ, స్పెషల్ అప్పీరియన్స్ తో మనోజ్ హీరోగా మంచు లక్ష్మి నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి..
ఈ పూజా కార్యక్రామాలకు మోహన్ బాబు, విష్ణు హాజరు కాకపోవడం టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్ న్యూస్ ప్రకారం, మోహన్ బాబు ఫ్యామిలీ మూడు ముక్కలుగా చీలిందని ప్రచారం జరుగుతుంది. మంచు విష్ణు, విష్ణు భార్య ఒక గ్రూపు, లక్ష్మీ ప్రసన్న మనోజ్ మరోక గ్రూపు, మూడవ గ్రూపుగా ఒక్క మోహన్ బాబు నిలిచారని తెలుస్తుంది. పిల్లల సొంత నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చినప్పుడు తాను అడ్డుగా ఉండబోనని, అందుకే తాను చూడటం తప్పితే జ్యోక్యం చేసుకోనని మోహన్ బాబు తన స్నేహితులతో అన్నట్టు ఫిలింనగర్ న్యూస్.. కాగా మోహన్ బాబు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని, టాలీవుడ్ లోని సినీ మేధావులు ప్రశంసిస్తున్నారు..


Click it and Unblock the Notifications











