రక్త చరిత్ర చిత్రంలో మోహన్ బాబు లేనట్లేనా?
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రంలో మోహన్ బాబు పాత్ర లేనట్లేనని ఫిల్మ్ సర్కల్స్ లో వినపడుతోంది.ఇందులో ఎన్టీఆర్ పాత్రకు మోహన్ బాబును అనుకుని ఆయన్ని కలిసి మరీ ప్రకటించారు. అయితే ఈ లోపు ఏం జరిగిందో ఏమో ఆ పాత్రను వర్మ మోహన్ బాబు చేత వేయించకుండా మూడు బాషల్లోనూ శతృఘ్న సిన్హా చేతే చేయిస్తున్నారని చెప్తున్నారు. ఇక ఈ చిత్ర కథలో ఎన్టీఆర్ పాత్ర చాలా ప్రాధాన్యత కలగిందని అంటున్నారు. అప్పట్లో పరిటాల రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంత్రి పదవి ఎన్టీఆర్ ఇచ్చారు. ఆ పాత్రను ఎన్టీఆర్ శిష్యుడు మోహన్ బాబు చేయటంతో నిండుతనం వస్తుందనుకున్నారు.అంతేగాక చిత్రానికి కూడా మంచి క్రేజ్ వస్తుంది. ఇక ఈ చిత్రంలో పరిటాల రవి పాత్రను వివేక్ ఒబరాయ్ పోషిస్తూండగా...మద్దెల చెరువు సూరి పాత్రను సూర్య పోషిస్తున్నారు.
రక్త చరిత్ర మోహన్ బాబు రామ్ గోపాల్ వర్మ శతృఘ్న సిన్హా వివేక్ ఒబరాయ్ పరిటాల రవి సూర్య mohan babu raktha charitra ram gopal varma surya


Click it and Unblock the Notifications