పరమవీరచక్రలో మోహన్ బాబు......?
పరమవీరచక్ర సినిమాలో కలక్షన్ కింగ్ 'మోహన్ బాబు' నటిస్తారని సమచారం. కోంత కాలంగా ఆయన మంచి సినిమాలో నటించాలని ఏదురు చూస్తున్నారని సమచారం అందుకోసం ఆయన ఎలాంటి చిన్న చితకా సినిమాలలో నటించడానికి ఓప్పుకోలేదని సినీ వర్గాలు అంటున్నాయి. మోహన్ బాబు సినిమాలో వున్నాడు అంటే మాటల రచయితకు పని ఏక్కువే వుంటుందనేది నిజం. ఏందు కంటే ఆయన ఏడైలాగు అయినా సరే తనదైన శైలిలో చెప్పి రక్తి కట్టిస్తారు.మాటల రచయితకు మంచి మార్కూలే వస్తాయి.
ఎన్టీఆర్ చివరి సినిమా 'మేజర్ చంద్రకాంత్'. ఈ సినిమాను మోహన్ బాబు నిర్మించి అందులో ఆయన కుమారుడిగా నటించారు. తరువాత 'జూఎన్టీఆర్' నటించిన 'యమదోంగ' లో మోహన్ బాబు నటించారు. ఎన్టీఆర్ కుటంబంతో మోహన్ బాబుతో ఏంతొ అనుబంధం వుంది. అంతకంటే ఎక్కువ దాసరి నారాయణ రావుతో మోహన్ బాబుకు అనుబంధం ఎక్కువే. నా కన్న 'కోడుకు' మోహన్ బాబు అని ఏన్నో సందర్బాలలో దాసరి అన్నారు.
అలాంటి దాసరి 150 వసినిమా పరమవీరచక్రలో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని సమచారం. అయితే ఈ సినిమాలోని నటినటుల వివరాలు పూర్తిగా ఇప్పటికి వెల్లడించలేదు. ఇప్పటికే బాలయ్య హీరోగా పూరి జగన్నాధ్ దర్శత్వంలో బెల్లంకోండ సురేష్ నిర్మించే సినిమాలో మోహన్ బాబు నటిస్తారని వార్తలు గుప్పుమన్నాయి.


Click it and Unblock the Notifications











