మోహన్ బాబుకి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు.. ధరెంతో తెలుసా?

కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా, తనదైన డిఫరెంట్ మ్యానరిజం డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. 90వ దశకంలో ఆయన హీరోగా చేసిన పలు హిట్ సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సినీ ఇండస్ట్రీలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే మోహన్ బాబుకు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు అత్యంత ఖరీదైన బహుమతిని అందించారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వీడియో వైరల్ : సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచు మోహన్ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. కలెక్షన్ కింగ్ అని ఆయన్ను ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఇటీవల ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు బహిర్గతం అయిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు ఉన్నట్లుగా ఓ వీడియో హల్ చల్ చేసింది. ఇందులో మనోజ్ సన్నిహితుడైన సారథిని విష్ణు కొట్టేందుకు వెళ్తున్నట్లుగా ఉంది.

Mohan Babu

ట్విటర్ వేదికగా : ఈ వీడియోను మనోజ్ చిత్రీకరించాడు. "ఇలా ఎవరని చూడకుండా ఇళ్లపై పడి కొడుతుంటాడు. ఇది పరిస్థితి" అంటూ మనోజ్ చెప్పిన మాటలు వాళ్ల మధ్య గొడవలు ఉన్నాయనే దానికి నిదర్శనంగా మారాయి. అయితే ఈ వీడియోపై మోహన్ బాబు సీరియస్ అయి డిలీట్ చేయించిన విషయం తెలిసిందే. తర్వాత కూడా మనోజ్ ట్విటర్ వేదికగా పలు పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.

ప్రతీది సెన్సేషన్ : ఈ క్రమంలోనే తిరుపతిలో ఓ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో మంచు బ్రదర్స్ గొడవలపై క్లారిటీ ఇవ్వమని అడిగిన మీడియా ప్రశ్నలను మోహన్ బాబు దాటవేశారు. మనోజ్ అయితే వెటకారంగా సమాధానం ఇచ్చి వివాదాలపాలయ్యాడు. మనోజ్ వైఖరిపై మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో ఏం చేసిన సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు తాజాగా మరొ వార్త హైలెట్ అవుతోంది.

అత్యంత ఖరీదైన : మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో తండ్రి మోహన్ బాబుకు మంచు విష్ణు భారీ సర్ ప్రైజ్ ఇచ్చాడట. పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబుకు అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUV కారుని విష్ణు బహుమతిగా అందించాడని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే ఈ కారు ధర ఏకంగా రూ. 5.25 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

Mohan Babu

ఎంత నిజముందో : ఇప్పటివరకు మోహన్ బాబు కారు కలెక్షన్స్ లో ఆడి క్యూ 7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చూనర్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUV చేరిందని టాక్. అయితే మోహన్ బాబుకు విష్ణు రూ. 5.25 కోట్ల ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చినట్లు మంచు ఫ్యామిలీ ఎక్కడా మాట్లాడలేదు. మళ్లీ మార్చి 19న పుట్టిన రోజు వేడుకలు జరిగితే ఈ వార్త ఇప్పుడు హైలెట్ అవుతోంది. మరి ఈ కాస్ట్ లీ గిఫ్ట్ మ్యాటర్ లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X