మోహన్ బాబు.. హీరోయిన్స్ సీక్రెట్
మోహన్‌బాబు హీరోయిన్ గా శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇ.నివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారని ఈ విషయాన్ని ఆయనే మీడియాకు తెలియచేసారు.అయితే ఐదుగురు హీరోయిన్స్ నిజానికి సినిమాలో మోహన్ బాబు ప్రక్కన చేయటం లేదని,కథలో భాగంగా వారంతా మోహన్ బాబుకు కూతుళ్ళుగా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.హీరోయిన్స్ అంటే ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందన అలా చెప్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో వినపడుోతంది.అలాగే ఈ చిత్రానికి రాయుడుకి కోపమొచ్చింది అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి మోహన్ బ బాబు మాట్లాడుతూ...''వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కబోతోంది. మా సంస్థ నుంచి వచ్చే మరో మంచి చిత్రంగా ఇది నిలుస్తుంది.అలాగే ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారు. వారు ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగు పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు మా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తారని అన్నారు.
అంతేగాక నేను ఆప్యాయంగా కెజిబి అని పిలుచుకొనే ముగ్గురు రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, బి.వి.ఎస్.రవి కలిసి ఒక చక్కటి స్క్రిప్టును సిద్ధం చేశారు. సంవత్సర కాలం స్టోరీ డిస్కషన్స్ సాగించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటుంది అన్నారు.
ఇక దర్శకుడు ఇ.నివాస్ గతంలో హిందీలో 'శూల్' అనే చిత్రాన్ని రూపొందించారు.రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ఆయన ఆ తర్వాత హిందీలో చేసిన సినిమాలు ఏమీ సక్సెస్ కాలేదు.కోనవెంకట్ రికమండేషన్ తో ఇన్నాళ్ళకు మళ్ళీ తెలుగులో వస్తున్నాడు.


Click it and Unblock the Notifications











