The Paradise: ది ప్యారడైజ్‌కి మోహన్‌బాబుకి రికార్డ్ రెమ్యునరేషన్.. కెరీర్‌లోనే హయ్యెస్ట్, ఎన్ని కోట్లంటే?

కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 50 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు మోహన్‌బాబు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, సహాయ నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఐదు దశాబ్థాల కెరీర్‌లో 600 వందలకు పైగా చిత్రాల్లో నటించి నేటికీ 70 ప్లస్‌లోనూ అదే ఎనర్జీతో దూసుకెళ్తున్నారు మోహన్‌బాబు. చాలా ఏళ్ల తర్వాత ఆయన ఓ సినిమాలో విలన్‌ రోల్ పోషిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు గాను మోహన్‌బాబు రికార్డ్ రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ది ప్యారడైజ్‌ తారాగణం
ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ప్యారడైజ్ సినిమాను దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్‌బాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. రాఘవ్ జుయల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ది ప్యారడైజ్‌లో అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. సీహెచ్ సాయి సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తోట శ్రీనివాస్ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Mohan Babu s Remuneration For The Paradise Collection King s Salary for Nani s movie Buzz Goes Viral

ది ప్యారడైజ్‌ రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్నింటికి మించి ది ప్యారడైజ్‌లో నాని లుక్ కొత్తగా ఉంది. రెండు జడలు వేసుకుని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు నాని. మాఫియా, పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ది ప్యారడైజ్‌ను తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ సహా 8 భాషల్లో ది ప్యారడైజ్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు. అయితే అదే రోజున పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుండటంతో ప్యారడైజ్ విడుదలపై గందరగోళం నెలకొంది. మార్చిన 26న పవన్‌ని నాని ఢీకొడతారా? లేక వెనక్కితగ్గి తమ సినిమాను మరో డేట్‌కి మార్చుకుంటారా? అనేది చూడాలి.

ది ప్యారడైజ్‌‌లో విలన్‌గా మోహన్‌బాబు
ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ది ప్యారడైజ్‌లో మోహన్ బాబు కీలకపాత్ర పోషించనున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి చెక్ పెట్టిన చిత్ర యూనిట్.. మోహన్ బాబు తమ సినిమాలో భాగం అవుతున్నట్లు తెలుపుతూ ఆయన లుక్ రివీల్ చేశారు. అయితే అందరు అనుకున్నట్లు ఇందులో మోహన్ బాబుది గెస్ట్ రోల్ కాదు.. ఏకంగా విలన్ రోల్. ది ప్యారడైజ్‌లో మోహన్ బాబు పాత్ర పేరు శికంజ మాలిక్. 70 ప్లస్‌ ఏజ్‌లో షర్ట్ లేకుండా రక్తంతో తడిసిన చేతులతో గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ రగ్గడ్ లుక్‌లో ఉన్న కలెక్షన్ కింగ్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ వెంటనే మరో పోస్టర్‌ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో మోహన్ బాబు వింటేజ్ లుక్‌లో యంగ్‌గా కనిపించారు. విలనిజాన్ని పునర్నర్విచించడానికి కాదు.. పూర్తిగా తిరగరాసేందుకు శిఖంజ వస్తున్నాడని రాసుకొచ్చింది చిత్ర యూనిట్. దాంతో మోహన్ బాబు ఈ సినిమాలో ఎలా కనిపించనున్నారు. నానిని ఎలా ఢీకొట్టనున్నాడు? అంటూ ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మోహన్‌బాబుకు రికార్డ్ రెమ్యునరేషన్?
ఇక ఈ సినిమా కోసం మోహన్‌బాబుకు రికార్డ్ రెమ్యునరేషన్ దక్కినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీని ప్రకారం మోహన్‌బాబుకు 5 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లిస్తున్నారట. ఇది కలెక్షన్ కింగ్ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. హీరోగా చేసినప్పుడు కూడా పెద్దాయన ఈ స్థాయిలో పారితోషికం అందుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటిది ఈ స్థాయిలో మోహన్‌బాబుకు రెమ్యునరేషన్ ఇస్తుండటంతో ట్రేడ్ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే మోహన్‌బాబుకు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారా? లేక ఇది గాలివార్తా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: mohan babu nani Paradise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X