మోహన్ బాబు పంచ్ డైలాగులను రజనీ కాపీ కొట్టాడా?

By Staff

Mohan Babu
రజనీకాంత్,డా.మోహన్ బాబు ప్రాణ మిత్రులనే సంగతి తెలిసిందే. అయితే మొన్న ఓ పంక్షన్ లో మోహన్ బాబు ..."రజనీకాంత్ నా డైలాగులు తమిళ సినిమాల్లో చెప్పి అందరి ప్రశంసలూ పొందారని" చెప్పి అందరికీ షాకిచ్చారు. ఈ సంఘటన మనోజ్ కుమార్ హీరోగా ,అజయ్ శాస్త్రి దర్శకత్వంలో రెడీ అవుతున్న 'నేను మీకు తెలుసా' తమిళ వెర్షన్ Yennai Theriyuma ఆడియో పంక్షన్ లో చోటుచేసుకుంది.
ఈ ఫంక్షన్ చెన్నైలో తమిళ సినీ ప్రముఖలు పి.వాసు,శింబు,వెంకట్ ప్రభు,ప్రభు,విజయ్ కుమార్,శక్తి,శిబి సమక్షంలో జరిగింది. తొలిసారిగా తమిళ తెరకు తన కుమారుడు పరిచయమవుతున్న సమయంలో అందరూ ఆదరణ చూపాలని చెపుతూ ,రజీనితో తనకున్న అనుభంధాన్ని చెబుతూ మోహన్ బాబు తన దైన శైలిలో మాట్లాడారు. అయితే ఆ మాటలు అక్కడ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించాయి.

ఆ ఉపన్యాసంలో ఆయన తన ఏక్టింగ్ కెరీర్ ని ఏ రకంగా ప్రారంభించారో తెలుపుతూ రజనీ కాంత్ ప్రస్తావన తెచ్చారు. అప్పట్లో ఆయన పాండి బజార్ లో రజనీని కలుసుకున్నారని,ఇద్దరూ స్నేహితులగా పరిశ్రమలో అవకాశాలకోసం కలిసే తిరిగామని చెప్పుకొచ్చారు. అలాగే ఆ రోజుల్లో భోజనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదని..చెప్పుకొచ్చారు. అంతే గాక నేను అప్పుడప్పుడూ చెప్పే పంచ్ డైలాగ్ లును రజనీ కాపీ చేస్తూ తమిళ చిత్రాలలో ఉపయోగించి అందరి ప్రశంసలు పొందేవాడని చెప్పుకొచ్చారు. అంతేగాక అప్పటినుండి ఇప్పటి వరకూ ఎప్పుడూ తాను ఆయన డైలాగులను కాపీ కొట్టలేదని అన్నారు.

అంతేగాక రజనీ చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని మంచి మిత్రుడని,ఆయన భార్య లత తనకు చెల్లెలు కన్నా ఎక్కువ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.అంతేగాక తనకు తమిళం అంటే ఇష్టమంటూ తనని అక్కడివారు కూడా ఇష్టపడతాన్ని చూసి ఆశ్యర్యపోతూంటానని చెప్పారు. ఇక ఈ ప్రసంగంలోని రజనీకి సంభంధించిన వాక్యాలు అక్కడున్న వారిని,తర్వాత తమిళ పరిశ్రమ వారిని ఒక క్షణం షాకయ్యేలా చేసాయని కానీ తర్వాత మోహన్ బాబు చెప్పిన మాటలు కూల్ చేసాయయని చెప్పుకుంటున్నారు. ఈ సంఘటనతో మోహన్ బాబుకి స్ట్రయిట్ గా మనుస్సులో ఉన్న మాటను చెప్పటం అలవాటేనన్న విషయం మరో సారి బయిట పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X