లక్ష్మీ ప్రసన్న విషయంలో వర్మకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు..!?
రామ్ గోపాల్ వర్మ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో డిపార్ట్ మెంట్ అనే సినిమాని హిందీ లో తెరకెక్కించబోతున్న విషయం విధితమే. ఈ డిపార్ట్ మెంట్ సినిమాలోనే లక్ష్మి ప్రసన్నఓ ప్రధాన పాత్రలోనటిస్తుంది. ఈ సినిమాలో రానా కూడా ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. మోహన్ బాబు కుమార్తె గానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ప్రసన్న ఇండియా లో తన ప్రస్థానాన్ని టివి షోలతో ప్రారంభించింది. జీ తెలుగు లో లక్ష్మి టాక్ షో, ఈ టీవి లో ప్రేమతో మీ లక్ష్మి అంటూ ప్రోగ్రామ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరైన లక్ష్మి టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేసింది. అనగనగా ఓ ధీరుడులో విలన్ గా నటించిన తరువాత రామ్ గోపాల్ వర్మ దొంగలముఠా లో చేసింది. రాముతో అప్పుడు ఏర్పడిన పరిచయంతోనే బాలీవుడ్ సినిమా చాన్స్ సంపాదించింది.
'దొంగలముఠా" చిత్రంలో మంచు లక్ష్మి చేత చిన్న క్యారెక్టర్ చేయించిన రామ్ గోపాల్ వర్మ ఆమెని ఇప్పుడు 'డిపార్ట్ మెంట్" సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు అయితే మిగతా నటీనటుల విషయంలో ఎలాంటి హద్దులు లేని వర్మకి లక్ష్మి ప్రసన్న విషయంలో మాత్రం కొన్ని షరత్తులు ఉన్నాయని సమాచారం. హీరోయిన్లతో ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేయించే డైరెక్టర్లలో ఒకడిగా పేరు పడ్డ రామ్ గోపాల్ వర్మ తన కూతురితో కూడా పిచ్చి వేషాలు వేయిస్తాడేమోనని మోహన్ బాబు అతనికి ముందే వార్నింగ్ ఇచ్చాడట. లక్ష్మి ప్రసన్న చాలా పద్దతిగా కనిపించాలని, కథకి అవసరమంటూ ఆమెని ఇష్టమొచ్చినట్టు చూపిస్తే కుదరదని మోహన్ బాబు తెగేసి చెప్పాడని ఇండస్ట్రీలో టాక్.
సాధారణంగా ఇలాంటి వాటికి లొంగని వర్మ ఎందుకో మంచు లక్ష్మి మేటర్ లో మాత్రం అన్ని షరత్తులకీ అంగీకరించాడట. లక్ష్మి చేసే పాత్రల విషయంలో మోహన్ బాబు చాలా కేర్ తీసుకుంటాన్నడనే సంగతి దీన్ని బట్టి అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











