Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సిక్స్ ప్యాక్‌తో మోహన్ బాబు?
హైదరాబాద్ : ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే విలక్షణ నటుడు మోహన్ బాబు త్వరలోనే 'రావణ' అనే సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రావణుడు పాత్రలో మోహన్ బాబు నటించబోయే ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తీయబోయే ఈ సినిమాతో తెలుగు, హిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తోంది మంచు ఫ్యామిలీ.
తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే ఈచిత్రంలో మోహన్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడట. ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచే చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటేన్ చేస్తున్నాడట. ఈ వయసులో ఆయనకు సిక్స్ ప్యాక్ రావడం కష్టమే కానీ....వీలైనంత వరకు ట్రై చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే మోహన్ బాబు ఫిట్ నెస్ ట్రైనింగులో ఎంటర్ అయ్యారని, ఫారన్ నుంచి వచ్చిన ఫిజికల్ ట్రైనర్ ఆయనకు ట్రైనింగ్ ఇస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక "రావణ" చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారట. వివరాల్లోకి వెళితే కలెక్షన్ కింగ్, కళాప్రపూర్ణ, డాక్టర్ మోహన్ బాబు హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, మంచు విష్ణువర్థన్ నిర్మించనున్న విభిన్న కథా చిత్రం "రావణ". ఇంకా షూటింగ్ మొదలు కాని ఈ "రావణ" చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట.
తండ్రి హీరోగా, తనయుడు నిర్మాతగా నిర్మించబోయే ఈ చిత్రం మీద దర్శకులు కె.రాఘవేంద్ర రావు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారనీ, ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.