మహేష్ బాబు చిత్రంలో మోహన్ బాబు కీ రోల్
మోహన్ బాబు త్వరలో ఓ ప్రత్యేక పాత్రలో మహేష్ బాబు చిత్రంలో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో మోహన్ బాబు కి ఓ కీలకమైన పాత్రను క్రియేట్ చేసి ఒప్పించినట్లు తెలుస్తోంది. బుజ్జిగాడు మేడిన్ చెన్నై, యమదొంగ చిత్రాల్లో సినిమాకు కీలకమైన పాత్రల్లో కనిపించి తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు మళ్లీ మరో సారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని తెలుస్తోంది. మహేష్ సినిమాలో పాత్ర అనేసరికి మోహన్ బాబు ఆసక్తి చూపించాడని చెప్పుకుంటున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ట్రేడ్ లో వస్తుందని భావిస్తున్నారు. ఇక సుకుమార్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దుతున్నట్లు సమాచారం.
మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఖరారైంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం హైదరాబాద్‌లో ఓ పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభించి, తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











