బాలీవుడ్ రీమేక్‌లో మోహన్ బాబు, సునీల్!
హైదరాబాద్: టాలీవుడ్లో మరో సరికొత్త కాంబినేషన్ రాబోతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు, హీరో సునీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. ఫిల్మ్ నుంచి అందుతున్న వార్తల ప్రకారం బాలీవుడ్ మూవీ 'వెల్ కమ్' చిత్రానికి రీమేక్ గా ఈచిత్రం రూపొందనుందని టాక్.
వెల్ కమ్ చిత్రంలో అక్షయ్ కుమార్, నానా పాటేకర్ నటించారు. దీనికి రీమేక్‌గా తెలుగులో రూపొందబోయే చిత్రంలో మోహన్ బాబు నానా పాటేకర్ పాత్రలో, సునీల్ అక్షయ్ కుమార్ పాత్రలో నటించనున్నారట. మరో ముఖ్యమైన పాత్రలో శ్రీహరి నటించనున్నట్లు తెలుస్తోంది.
'లక్ష్యం' చిత్రం ఫేమ్ శ్రీవాసు ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తారని, లక్ష్మి ప్రసన్న ఫిల్మ్స్ పతాకంపై డాక్టర్ మోహన్ బాబు ఈచిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం సునీల్ 'మిస్టర్ పెళ్లి కొడుకు' చిత్రంలో నటిస్తున్నాడు. హిందీలో హిట్టయిన 'తను వెడ్స్ మను'ను చిత్రానికి ఇది రీమేక్. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నటిస్తున్న ఈచిత్రంలో సునీల్ సరసన ఇషా చావ్లా కథానాయకిగా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
మరో వైపు సునీల్ తమిళ చిత్రం 'వెట్టై'కి రీమేక్ గా రూపొందుతున్న తెలుగు చిత్రంలో నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నాడు. దీంతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ పై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సంబరాల రాంబాబు' చిత్రానికి కూడా కమిట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











