»   »  నరుకుతానంటూ మోహన్ బాబు వార్నింగ్!?

నరుకుతానంటూ మోహన్ బాబు వార్నింగ్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mohan Babu
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్ బాబు సెల్ ఫోన్ వాడితే నరుకుతానంటూ బోర్డు పెట్టించాడట. మంచు ఫ్యామిలీ స్టార్స్ అయిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతో రూపొందుతోన్న మల్టీ స్టారర్ సినిమా సెట్లో ఈ బోర్డు పెట్టించారని సమాచారం. 'సెల్ ఫోన్ వాడిన వారిని నరక బడును...గమనిక : ప్రొడ్యూసర్స్‌కు, మేనేజర్స్‌కి వర్తించదు' అని ప్రత్యేకంగా బోర్డు పెట్టించారట.

సెల్ ఫోన్ల వల్ల సినిమాలోని సీన్లు, సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు లీక్ అవుతుందనే భయంతో....ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన ఈ బోర్డు పెట్టించినట్లు స్పష్టం అవుతోంది. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ సంస్థపై మంచు విష్ణు, మనోజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో పాటు వరుణ్‌ సందేశ్‌, తనీష్‌లు కూడా నటిస్తున్నారు. విష్ణు, మనోజ్ సరసన హన్సిక, ప్రణీత హీరోయిన్స్. మంచు విష్ణు గతంలో ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ''మేమిద్దరం హీరోలుగా నిలదొక్కుకోవడానికి డాడీయే స్ఫూర్తి. ఆయన శ్రమ మమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడు డాడీ హీరోగా మేం సినిమాను నిర్మించడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి నటించబోతున్నామనే విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆద్యంతం వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రమిది'' అన్నారు.

ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతోంది. ఇది ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మాకు సినీ జన్మను ప్రసాదించిన మా తండ్రి మోహన్‌బాబుతో మొదటిసారి మేం నిర్మిస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ మించి ఉంటుందని చెప్పుకొచ్చారు. రచన: గోపీ మోహన్‌, కోన వెంకట్‌, బీవీయస్‌ రవి, ఛాయాగ్రహణం: పళనికుమార్‌, సమర్పణ: అరియానా, వివియానా.

English summary

 Mohan Babu took stringent measures to prevent usage of cell phones on the movie sets. The actor tagged a board on sets of his film that reads, “Cell phone Users are to be killed. Note: Producers and Managers are exception.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu