మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రారంభించబోయే కొత్త చిత్రంలో మోహన్ బాబు నెగిటివ్ రోల్ కి కమిటయ్యారనే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. విలన్ ఎంత పవర్ ఫుల్ అయితే హీరో అంతగా ఎలివేట్ అవుతాడనేది సినిమా రూలు. దాంతో విలన్స్ కి ఎప్పుడూ డిమాండే. గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమ హీరోయిన్లు లాగే విలన్స్ ను కూడా ముంబాయి నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక ప్రకాష్ రాజ్ వంటి సమర్ధులు ఉన్నా టైం సెన్స్ లేకపోవటం, మరికొన్ని సమస్యలతో ఈ దారి పట్టటం తప్పటంలేదు. దాంతో మోహన్ బాబు వంటి డైలాగు డెలవరి, నటన ఉన్న వాళ్ళ కోసం వేట ప్రారంభమయ్యింది. అప్పుడు రాజమౌళికి ఓ అద్భుత నటుడు గుర్తుకొచ్చారు. దాంతో వెంటనే ఎప్రోచ్ అయ్యి ఒప్పించాడు. ఆయనే మోహన్ బాబు. అలా తెలుగు తెరకు మోహన్ బాబు మళ్ళీ ప్రతి నాయకుడు అయ్యాడు. అసలు హీరోగా కెరిర్ ప్రారంభించి విలన్ పాత్రలకు షిప్ట్ అయ్యి తరువాత క్యారక్టర్ ఆర్టిస్టుగానూ తన సత్తా నిరూపించుకుని మళ్ళీ హీరో అయ్యారు డాక్టర్ మోహన్ బాబు. ఇప్పుడు యమదొంగ విజయోత్సాహంతో తిరిగ ప్రతినాయకుడు పాత్రలు వైపు మొగ్గు చూపుతున్నారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నైలో త్రిషకు అన్నగా కనిపించబోతున్నారు.