టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీలో మరోసారి మోహన్ లాల్
సీనియర్ నటుడు మోహన్ లాల్ అంటే సినీ ప్రేక్షకులకు తెలియని పేరు కాదు. నటనలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన కేవలం మలయాళం పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన నటనతో అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడేప్పుడో 1994లో వచ్చిన గాండీవం సినిమాలో ఒక పాటలో కనిపించిన మోహన్ లాల్ మళ్ళీ 20 ఏళ్ళ అనంతరం తెలుగు తెరపై కనిపించారు.
కొరటాల శివ, మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే మనమంతా సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత మోహన్ లాల్ టాలీవుడ్ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ కొరటాల శివ ద్వారానే ఆయన టాలీవుడ్ తెరపై కనిపిస్తారట. అల్లు అర్జున్ పుష్ప సినిమా అనంతరం కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మోహన్ లాల్ ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడట. కథలో అదే చాలా పవర్ఫుల్ రోల్ అని కొరటాల మరో ఆప్షన్ లేకుండా మోహన్ లాల్ ను ఫిక్స్ అయ్యారట. అందుకు మోహన్ లాల్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఆచార్య అనంతరం కొరటాల బన్నీ సినిమాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నాడు.


Click it and Unblock the Notifications











