చిరంజీవి కోసం సాహసం చేస్తున్న డైరెక్టర్: ఇరికించడం వల్ల వర్కౌట్ అవుతుందా?
సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆయన మరింత వేగం పెంచి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సైరా: నరిసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆశించినంతగా ఆడకపోవడంతో ఈ సారి సరైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే మరో మూవీని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ముందుకొచ్చారు చిరంజీవి. మొదట్లో ఈ సినిమాను సుజిత్‌తో తీయాలని భావించారు. కానీ, తప్పుకోవడంతో తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ధృవ' మాతృక అయిన 'తని ఒరువన్' దర్శకుడు మోహన్ రాజాను ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం 'లూసీఫర్' తెలుగు రీమేక్‌పై స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టిన డైరెక్టర్ మోహన్ రాజా.. అందులో చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఓ హీరోయిన్ పాత్రను క్రియేట్ చేయబోతున్నాడట. అంతేకాదు, రెండు మూడు పాటలను కూడా జోడించాడని సమాచారం. వాస్తవానికి 'లూసీఫర్'లో మోహన్ లాల్‌కు జోడీగా ఎవరూ చేయలేదు. అలాగే, అందులో పాటలు కూడా లేవు. దీంతో తెలుగులో చేస్తున్న మార్పులు.. సక్సెస్ అవుతాయా.? ఇరికించడం ద్వారా ఇబ్బందులు పెడతాయా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











