మోహన్ బాబు ఎపిసోడ్ 'చిరు'పార్టి పై సెటైరా?

ఎందుకంటే పొలిటికల్ సెటైర్ చిత్రాలు తీయటంలోనూ,సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు తీయటంలోనూ దాసరిది అందెవేసిన చేయి. అందులోనూ తన శిష్యుడు మోహన్ బాబుని ఏరి కోరి పాత్రకు తీసుకోవటంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని చెప్తున్నారు. అంతేగాక సినిమాకోసం వెచ్చించే పన్నెండు కోట్ల బడ్జెట్ లో మూడు కోట్లు ఈ ఎపిసోడ్ కే కేటాయించటం అందరినీ ఆలోచనలలో ఫడేస్తోంది. అప్పట్లో వరస పరాజయాలు గ్యాప్ తర్వాత దాసరి తీసిన బ్లాక్ బస్టర్ ఒసేయ్ రాములమ్మ తరహాలో ఈ సినిమా పేలుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. సిరీ మీడియా వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు.
దాసరిని పరిశ్రమలో అంతా మేస్త్రి అని పిలుస్తూంటారని అందుకే ఆ టైటిల్ పెట్టారని చెప్తున్నారు. ఇక మోహన్ బాబు తన కుమారుడు విష్ణు వర్ధన్ ని వైయస్.బంధువుల అమ్మాయికి ఇచ్చి చేయటం ద్వారా కాంగ్రేస్ కి చేరువ అవుతున్నారని,ఆల్రెడీ దాసరి కాంగ్రేస్ వ్యక్తే కాబట్టి వారిద్దరూ కలిసి చిరుని ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారనేది పరిశ్రమమాట. అయితే ఈ మేటర్ లో నిజా నిజాలు ఎలా ఉన్నా పరిశ్రమలో ఓ వర్గం మాత్రం ఇటువంటి సీన్లుతో సినిమా రావాలనే ఆకాంక్షతో ఉన్నారనేది సుస్పష్టం.


Click it and Unblock the Notifications











