బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: మరో ఈవెంట్‌కు ‘అల’ టీమ్ రెడీ.. ముఖ్య అతిథిగా సూపర్ స్టార్.!

By Manoj

తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. అద్భుతమైన నటన, డ్యాన్స్, స్టైల్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన బన్నీ.. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇది అతడి దృష్టికి వెళ్లడంతో ఇకపై వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపేశాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో ఈవెంట్ నిర్వహించనున్నారని, దానికి సూపర్ స్టార్ గెస్ట్‌గా వస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైకుంఠపురములో ఉన్నది వీళ్లే

వైకుంఠపురములో ఉన్నది వీళ్లే


రెండు సూపర్ హిట్‌ల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రమే ‘అల.. వైకుంఠపురములో'. రాధాకృష్ణ, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అలాగే ఇందులో నవదీప్, టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, మురళీ శర్మ, సముద్రఖని సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సౌతిండియా రికార్డులు బద్దలు

సౌతిండియా రికార్డులు బద్దలు


సంక్రాంతికి రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో' కొద్ది రోజుల క్రితమే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే టీజర్, ట్రైలర్ సహా పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేశారు. వీటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘సామజవరగమన', ‘రాములో రాములా' అనే పాటలు దక్షిణ భారతదేశ రికార్డులను బద్దలు కొట్టాయి.

గెస్ట్ లేకున్నా.. భారీ సక్సెస్

గెస్ట్ లేకున్నా.. భారీ సక్సెస్


సోమవారం ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఇందులో సినిమాలోని ప్రతి పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సింగర్లు. అలాగే, అల్లు అర్జున్ సహా కొందరు చిన్న చిన్న స్టెప్పులు వేశారు. ఈ వేడుకకు గెస్ట్‌లు రాకున్నా భారీ సక్సెస్ అయింది. యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్ మొత్తం అల్లు అర్జున్ అభిమానులతో నిండిపోయింది.

బన్నీ క్రేజ్‌తో అక్కడ కూడా రిలీజ్

బన్నీ క్రేజ్‌తో అక్కడ కూడా రిలీజ్


‘అల.. వైకుంఠపురములో' తెలుగుతో పాటు మలయాళంలోనూ తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ లోకల్ హీరోలానే బన్నీని కూడా ట్రీట్ చేస్తారు. అందుకే ఈ సినిమాను ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ వెర్షన్ టీజర్ సహా పలు పాటలను కూడా వదిలారు.

మరో ఈవెంట్‌కు ‘అల’ టీమ్ రెడీ

మరో ఈవెంట్‌కు ‘అల’ టీమ్ రెడీ

ఈ సినిమా మలయాళంలోనూ విడుదలవుతున్న నేపథ్యంలో, కేరళలో కూడా ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేయబోతుందట బన్నీ అండ్ టీమ్. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. రెండు రోజుల్లో అక్కడ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయబోతున్నారట. దీనికి సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయనతో అల్లు అరవింద్ మాట్లాడారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X