Game Changer: రామ్ చరణ్ సినిమాలో మరో సూపర్ స్టార్.. ముఖ్యమంత్రి పాత్రలో ఎన్టీఆర్ బాబాయి

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనలోని అన్ని టాలెంట్లను చూపిస్తూ తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు.

అంతేకాదు, కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సైతం పెంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీలో మరో హీరో కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

Mohanlal CM Role Highlight in Ram Charan Game Changer Movie

గేమ్ చేంజర్‌గా మెగా హీరో
దిగ్గజ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమే 'గేమ్ చేంజర్'. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు.

Mohanlal CM Role Highlight in Ram Charan Game Changer Movie

షూటింగ్ చాలా ఆలస్యం

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ 2021 చివర్లోనే ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌లోనే చాలా మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా పలు షెడ్యూల్‌లను పూర్తి చేశారు. మధ్యలో చాలా గ్యాప్‌లు కూడా వచ్చాయి. ఇలా ఇప్పటికి 70 శాతం వరకూ మాత్రమే కంప్లీట్ చేశారు.

Mohanlal CM Role Highlight in Ram Charan Game Changer Movie

ఇప్పుడా సీన్స్‌లో చరణ్
'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ చాలా రోజులు ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంభించారు. అక్కడ రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇందులో చరణ్ లుక్ అదిరిపోయేలా ఉన్న విషయం తెలిసిందే.

పొలిటికల్ టచ్ పెట్టాడు

'గేమ్ చేంజర్' మూవీ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర రాజకీయ నాయకుడిగా, మరో పాత్ర ఐఏఎస్ అధికారిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా అంతా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. అంతేకాదు, ఇందులో కొన్ని రియల్ ఇన్సిడెంట్లను కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

Mohanlal CM Role Highlight in Ram Charan Game Changer Movie

గేమ్ చేంజర్‌లో స్టార్ హీరో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' సినిమాలో దక్షిణాది, ఉత్తరాదికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటుల పేర్లను కూడా రివీల్ చేశారు. ఈ క్రమంలోనే ఇందులో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

Mohanlal CM Role Highlight in Ram Charan Game Changer Movie

సీఎం రోల్‌లో మోహన్‌లాల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో మోహన్‌లాల్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. సెకెండాఫ్‌లో వచ్చే ఈ రోల్ ఎంతో హైలైట్‌గా ఉండబోతుందని అంటున్నారు. అంతేకాదు, చరణ్, మోహన్‌లాల్ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా, సరికొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. ఇక, గతంలో మోహన్‌లాల్ 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ బాబాయిగా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X