twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంటి రెమ్యూనరేషన్‌గా మరీ అన్ని కోట్లా.. బిగ్ బాస్ టీంకు స్టార్ హీరో షాక్

    |

    బిగ్ బాస్ షో మొదలవుతోందంటే చాలు గాసిప్ రాయుళ్లకు, లీకు వీరులకు పండుగే. షోలో రాబోతోన్న కంటెస్టెంట్లు వీళ్లే అంటూ నానా రకాల వార్తలు రాస్తారు. అందులో వచ్చేవారెంత మందో రాని వారెంత మందో చివరి క్షణం వరకు అంతగా తెలియదు. అయితే కొన్ని సార్లు మాత్రం ఆ రూమర్లే నిజమవుతుంటాయి. ఇక బిగ్ బాస్ లీకుల్లు ఎక్కువగా వినిపించేది మాత్రం రెమ్యూనరేషన్ గురించే. కంటెస్టెంట్ల రెమ్యూనరేష్ ఒక లెక్క అయితే హోస్ట్‌గా ఉన్న స్టార్ హీరో రెమ్యూనరేషన్ మరో లెక్క.

    భారీ స్థాయిలో..

    భారీ స్థాయిలో..

    మామూలుగా బిగ్ బాస్ టీం షోను భారీ ఎత్తులతో నిర్వహిస్తారు. అంతా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంటారు. బిగ్ బాస్ ఇంటిని చూస్తేనే ఇంద్ర భవనంలా ఉంటుంది. అలాంటిది రెమ్యూనరేషన్ విషయంలో ఇంకెలా ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అయితే ఆ లెక్కలు మాత్రం ఒక్కో భాషలో వచ్చే షోకు మారుతూ ఉంటుంది.

    అందరికంటే ఎక్కువగా..

    అందరికంటే ఎక్కువగా..

    ఇండియాలో ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ వస్తుంటుంది. అయితే అన్నింటి కంటే హిందీ బిగ్ బాస్ సీనియర్. ఇప్పుడు పద్నాలుగో సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌కు సల్మాన్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. ఒక్కో ఎపిసోడ్‌కు 20 కోట్ల చొప్పున మొత్తంగా 480 కోట్లు జేబులో వేసుకున్నాడని సమాచారం.

    తెలుగులో తక్కువే..

    తెలుగులో తక్కువే..

    అయితే బిగ్ బాస్ రెమ్యూనరేషన్‌లతో తెలుగులోనే చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు కాస్త ఎక్కువగా.. నానికి మరీ తక్కువగా.. నాగార్జునకు ఓ మోస్తరుగా చెల్లించినట్టు తెలుస్తోంది. వీరి రెమ్యూనరేషన్‌లు మొత్తం లెక్కలు వేస్తే కూడా ఐదు కోట్లు కూడా దాటేలా లేవు. ఎపిసోడ్‌కు పది పదిహేను ఇరవై లక్షలు తీసుకున్నట్టు టాక్.

    మోహన్ లాల్ రచ్చ...

    మోహన్ లాల్ రచ్చ...

    ప్రస్తుతం మళయాలంలో బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 14న లాంచ్ కాబోతోన్న ఈ షోకు మోహన్ లాల్ దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. ఇంతకు ముందు తీసుకున్న దానికంటే మరింత ఎక్కువగా అడిగాడట.

    మరీ అంతనా?

    మరీ అంతనా?

    బిగ్ బాస్ రెండో సీజన్‌కు మోహన్ లాల్ దాదాపు 12 కోట్లు తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు మాత్రం 18కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అంటే దక్షిణాదిలో మామూలు విషయం కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    English summary
    Mohanlal Huge remuneration For Bigg Boss 3rd season,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X