ఎన్టీఆర్ చిత్రంలో కీ రోల్ మోహన్ లాల్?
ఇదిలావుండగా ఈ సినిమాకు 'రభస' అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు సమాచారం. అయితే ఆ టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఆ టైటిల్ ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ఉంచారని సమాచారం. ఎన్టీఆర్ మరో మంచి టైటిల్ ఆలోచించమని,ఇంతకన్నా ఫవర్ ఫుల్ టైటిల్ రాకపోతే అప్పుడు ఇదే టైటిల్ ఫైనలైజ్ చేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. మొదట ఈ చిత్రాన్ని రామ్ హీరోగా రూపొందించడానికి ప్లాన్ చేశారు. అయితే కథానుగుణంగా భారీ బడ్జెట్ కాబోతుండటంతో బిజినెస్,మార్కిటింగ్ వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఎన్టీఆర్‌ను హీరోగా ఎంచుకున్నట్లు తెలిసింది.
పక్కామాస్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో హీరో పాత్ర కు అనుగుణంగా టైటిల్ కుదరడంతో ఎన్టీఆర్ కూడా అదే టైటిల్‌ను ఓకే చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 'కందిరీగ'తో కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న సంతోష్‌శ్రీనివాస్ రెండో చిత్రం ద్వారానే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడని అంటున్నారు.
వచ్చే సంవత్సరం ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న 'బాద్‌షా' షూటింగ్ చివరి దశలో వుంది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించనున్న చిత్రం జనవరి 3నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది. వీటితో పాటు ఈ కొత్త చిత్రం కూడా షూటింగ్ మొదలు కానుంది.


Click it and Unblock the Notifications












