ఎన్టీఆర్ సినిమాలో సూపర్ స్టార్ కీలక పాత్ర: ప్రశాంత్ నీల్ స్కెచ్ అదిరిందిగా!

నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మొదట్లోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కిన తారక్.. ఆ తర్వాత వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో సత్తా చాటాడు.

హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. ఎప్పుడో ప్రకటించినా.. ఈ సినిమా ఇప్పటి వరకూ మొదలు కాలేదు. అయితే, దీన్ని జూలై రెండో వారం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Mohanlal Key Role in Jr NTR and Prashanth Neel Movie

RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీన్ని కొరటాల శివ మూవీ తర్వాత మొదలు పెడుతున్నట్లు కూడా వెల్లడించాడు. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ కూడా ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్'ను పూర్తి చేస్తాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, సలార్ మూవీ ఖాళీ సమయంలో ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా.. దీని గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇందులో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అది మరువక ముందే ఇప్పుడు మరో బిగ్ స్టార్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు.. మలయాళ పరిశ్రమలో సత్తా చాటుతోన్న సూపర్ స్టార్ మోహన్‌లాల్. ఈయన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కీలక పాత్రను చేయబోతున్నారట. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న చిత్రం కావడంతో కేరళలో ప్రభావాన్ని చూపేందుకు ఆయనను ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కూడా రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా చేయబోతున్నాడు. ఇక, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ చిత్రానికి 'మిస్సైల్', 'న్యూక్లియర్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే ఈ సినిమాకు 'అసుర' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X