షాకిస్తోన్న మోహన్‌లాల్‌‌ రెమ్యునరేషన్.. కెరీర్‌లోనే హయ్యెస్ట్!.. గెస్ట్ రోల్‌కే అన్ని కోట్లా?

దాదాపు 40 ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మోహన్‌లాల్. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ అగ్రనటుడు.. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవలే 65వ వసంతంలోకి అడుగుపెట్టిన మోహన్‌లాల్.. ఈ వయసులోనూ క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడుతున్నారు. కుర్రాళ్లని మించి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానన్న మోహన్‌లాల్ అదే బాటలో నడుస్తున్నారు.

ఎల్ 2: ఎంపురాన్‌తో విధ్వంసం
ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమకు తన సినిమాలతో ఊపు తీసుకొచ్చారు మోహన్‌లాల్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఎల్ 2: ఎంపురాన్ కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. భారీ ఓపెనింగ్స్‌తో ఈ అంచనాను మోహన్‌లాలో నిజం చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే థియేట్రికల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.270 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకుంది ఎల్ 2: ఎంపురన్. అయినప్పటికీ నిర్మాతలకు లాభాలనే అందించింది.

Mohanlal To Take How Much Remuneration For Dileep s Bha Bha Ba Movie

తుడరంతో బాక్సాఫీస్ షేక్
ఎల్ 2: ఎంపురాన్ వచ్చిన కొద్దిరోజులకే తుడరం అంటూ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మోహన్‌లాల్ ఈసారి మాత్రం బాక్సాఫీస్‌ను వణికించాడు. కేవలం రూ.30 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన తుడరం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.235 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. తద్వారా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఈ చిత్రం మూడో స్థానంలో నిలిచింది. అలాగే కేరళలో రూ.100 కోట్లు రాబట్టిన తొలి సినిమాగా తుడరం రికార్డు సృష్టించింది. విడుదలై నెల రోజులు దాటినా, ఓటీటీలో అందుబాటులో ఉన్నా ఇప్పటికీ థియేటర్లలో ఈ చిత్రానికి ఆదరణ తగ్గడం లేదు.

చేతినిండా సినిమాలతో మోహన్‌లాల్
వరుసగా రెండు సార్లు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కెరీర్‌లోనే పీక్స్‌లో ఉన్నారు మోహన్‌లాల్. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మోహన్‌లాల్.. తెలుగులో కన్నప్ప చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో హృదయపూర్వం, రామ్ సహా మరో చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు- మలయాళంలలో తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం వృషభలోనూ మోహన్‌లాల్ నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ మలయాళంకు హోస్టింగ్ చేయనున్నారు మోహన్‌లాల్.

గెస్ట్‌ రోల్ కోసం భారీగా రెమ్యునరేషన్
చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న మోహన్‌లాల్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిలీప్ కుమార్‌ హీరోగా నటిస్తున్న భయం భక్తి బహుమానం (భభబ) అనే సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన 18 రోజులు డేట్స్ ఇచ్చినట్లుగా టాక్. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రూ.12 కోట్లను పారితోషికంగా ఛార్జ్ చేస్తున్నారట మోహన్‌లాల్. గతంలో ఆయన సినిమా మొత్తానికి రెమ్యునరేషన్ రూ.10 నుంచి రూ.15 కోట్ల మధ్యలో ఉండేది. అలాంటిది గెస్ట్ రోల్ కోసమే ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటే మోహన్‌లాల్ రేంజ్‌ ఇప్పుడెలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Read more about: mohanlal dileep movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X