For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక్కడ పవన్.. అక్కడ సూపర్‌స్టార్.. చిరంజీవి కోసం రామ్ చరణ్ అదిరిపోయే ప్లాన్

|
Mohanlal Voice Over For Sye Raa Malayalam Teaser || Filmibeat Telugu

2017లో 'ఖైదీ నెంబర్ 150'తో తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో చిరు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే భారీ వసూళ్లను కూడా రాబట్టిందీ సినిమా. ఇక, ఈ సినిమా తర్వాత కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తిరమైన వార్త బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ప్రమోషన్ షురూ

ప్రమోషన్ షురూ

గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసింది. విడుదలకు తక్కువ వ్యవధి ఉండడంతో ఈ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 1.47 నిమిషాలున్న ‘సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది.

టీజర్‌కు ముహూర్తం పెట్టేశారు

టీజర్‌కు ముహూర్తం పెట్టేశారు

గతంలో ‘సైరా: నరసింహారెడ్డి' టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ చిత్ర మరో టీజర్‌ను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు ‘సైరా' సినిమా టీజర్‌ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్‌ చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పవన్ వాయిస్ ఓవర్

పవన్ వాయిస్ ఓవర్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన విషయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా ఇన్వాల్వ్ చేసేశారు. మంగళవారం విడుదల కాబోయే సినిమా టీజర్‌ కోసం ఆయనతో ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ చెప్పించారు. గంభీరమైన స్వరంతో పవన్ చెప్పే డైలాగులు దీనికి ప్రధానాకర్షణ కానున్నాయని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

మలయాళంలో సూపర్‌స్టార్‌తో...

మలయాళంలో సూపర్‌స్టార్‌తో...

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అందుకే అన్ని భాషల్లో టీజర్లు కట్ చేస్తున్నారు. హిందీ, తమిళం, కన్నడం నుంచి పలువురు స్టార్లు ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండగా.. మలయాళం నుంచి ఎవరూ లేరు. ఈ లోటును భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారని తెలిసింది. ఇక్కడ పవన్ చెప్పినట్లే.. అక్కడ మోహన్‌లాల్ టీజర్ కోసం తన స్వరాన్ని వినిపించారని సమాచారం.

సైరా గురించి..

సైరా గురించి..

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

English summary
Sye Raa Narasimha Reddy, a Megastar Chiranjeevi starrer, is one of the most awaited films of this year, has finally got a buyer in Bollywood. It is said that actor Farhan Akhtar has bought the Hindi dubbing rights of the film.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more