‘మోక్షజ్ఞ’ ఎంట్రీతో జూ ఎన్టీఆర్ డేంజర్ లోపడే సూచన..!
తెలుగు పరిశ్రమలో ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం హీరో కొడుకులు హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేయంట. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు ముగ్గరు హీరోలు రావటంతో పెద్ద సమస్య వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే ముగ్గురు వెండితెరను ఏలుతున్నారు. బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా వెలుగుతున్నారు. ప్రస్తుతం 'బాలకృష్ణ" కొడుకు మోక్షజ్ఞ వెండితెరపైకి వచ్చిన రోజున, జూ ఎన్టీఆర్"కు పెద్ దెబ్బతగులుతుందని ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతోంది.
జూ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రవేశించి ఇప్పటికే 11సంవత్సరాలు అయ్యింది. మోక్షజ్ఞ ప్రవేశంతో నందమూరి ఫ్యాన్స్ 'మోక్షజ్ఞ" వైపు మొగ్గుతారని ఊహిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కనుక మంచి నటుడైతే ఎటువంటి పరిస్థితులోనూ ఎన్టీఆర్ కెరియర్ కే దెబ్బ అని ఫిలింనగర్ వాసుల ఊహాగానాలు. అందుకు ఉదాహారణకు మెగా ఫ్యామిలి నిదర్శనం. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ రాకముందు అల్లు అర్జున్ కు ఎంతో ఫాలోయింగ్ ఉన్నింది. రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి కొంచెం ఇరకాటంలో పడిందని, రాబోయే రోజుల్లో రామ్ చరణ్ కి మెగా ఫ్యాన్స్ పట్టం కడతారని సినీజనాలు ఊహిస్తున్నారు. కాబట్టి మోక్షజ్ఞ వస్తే జూ ఎన్టీఆర్ కి కష్టాలు తప్పవేమో...!


Click it and Unblock the Notifications











