»   » "ఆదిత్యా 999" లో మోక్షజ్ఞ పాత్ర

"ఆదిత్యా 999" లో మోక్షజ్ఞ పాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే బాలయ్య తన ప్రతిష్టాత్మక గా భావించి చేస్తున్న వందో చిత్రం 'ఆదిత్యా 999' లో అతనికి స్ధానం కల్పించనున్నాడని తెలుస్తోంది. మరి ఆ వందో చిత్రంలో మోక్షజ్ఞ క్యారక్టర్ ఏమై ఉంటుంది అనే విషయమై ఆల్రెడీ స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మోక్షజ్ఞ...ఓ పది నిముషాలు పాటు మెరవనున్నారు. యంగ్ బాలకృష్ణలా అదరకొట్టనున్నారు. ఈ చిత్రంలో చిన్నప్పటి బాలకృష్ణలాగా, గణిత మేధావిగా కనిపించి అలరించనున్నాడు. అంతేకాదు మరో సైంటిస్ట్ కు టైమ్ ట్రావిలింగ్ విషయంలో తన తెలివితేటలతో సహాకారం కూడా అందిస్తాడు.

గతంలో బాలకృష్ణ ను కూడా ఎన్టీఆర్ ఇలానే లాంచ్ చేసారు తాతమ్మ కలలో చిన్న రోల్ తో.. ఇప్పుడు అదే సెంటిమెంటే తో మెక్షజ్ఞనికూడా తెరగ్రేటం చేయిస్తున్నారు. మరి ఈ యంగ్ లాడ్ ఎలా మురిపిస్తాడో చూడాలి.

Mokshagna role in Aditya 999?

వందో చిత్రం మరిన్ని విశేషాలకు వస్తే...

ఇక బాలకృష్ణ తన తాజా చిత్రం డిక్టేటర్ విజయోత్సాహంలో ఉన్నారు. మరో ప్రక్క ఆయన తన వందో చిత్రం అఫీషియల్ గా ప్రకటించి నందమూరి అబిమానులకు ఆనందం కలుగచేసారు. వందో చిత్రంగా రూపొందనున్న ‘ఆదిత్యా 369' చిత్రానికి సీక్వెల్ ‘ఆదిత్యా 999' ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదనేది అందరికీ ఆసక్తే.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వందో చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. అంటే 2017కి బాలయ్య ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాడన్నమాట. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని ఆయన భావిస్తున్నారు. విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ కు ఎక్కువ సమయం పట్టనుండటంతో ఈ మాత్రం టైమ్ పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లు ఈ వందో చిత్రం రూపొందనుంది.

గత కొద్ది కాలంగా నందమూరి అబిమానుల్లో ఉన్న ప్రశ్న... నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది? ఎలాంటి చిత్రం చేస్తారు? ఈ ప్రశ్నకు మొన్నీ మధ్యే సమాధానం దొరికింది. హైదరాబాద్‌లో జరిగిన 'డిక్టేటర్' విజయోత్సవంలో వందో చిత్రం గురించి బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు.

Mokshagna role in Aditya 999?

పాతికేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను చేసిన 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా రూపొందనున్న 'ఆదిత్య 999' తన వందో చిత్రమని తెలిపారు. ఈ సీక్వెల్ కూడా సింగీతం దర్శకత్వంలోనే రూపొందనుందని చెప్పారు. ఇప్పటికే స్టోరీబోర్డ్‌తో సహా సిద్ధమైన ఈ కథ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

సింగీతం మాట్లాడుతూ..."బాలకృష్ణతో ఆదిత్య 369 కొనసాగింపు చిత్రం కి కథని సిద్ధం చేస్తున్నాం. సినిమాకి ఆదిత్య999 అని పేరు కూడా అనుకుంటున్నాం. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. పాత సినిమాకి ఏం మాత్రం సంబంధం లేని సినిమాగా రూపొందిస్తాం" అంటూ చెప్పుకొచ్చారు . ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

English summary
Buzz says Mokshagna will be seen in a role that lasts for 10 minutes in "Aditya 999".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu