మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్!
నందమూరి మోక్షజ్ఞ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించబోతున్నాడనే వార్తలు పరిధి పెరుగుతోంది. కొంత కాలంగా ఈ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య తన తండ్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆవిష్కరించే చిత్రం కావడంతో బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించబోతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మోక్షజ్ఞ ఎన్టీఆర్ టీనేజ్ రోల్ పోషించబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ టీనేజ్ లవ్ స్టోరీలో భాగంగా మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లుగా ప్రచారం మొదలైపోయింది.

రకుల్, మోక్షజ్ఞ మధ్య సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని అంటున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటన చేయడం లేదు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభం అయింది.


Click it and Unblock the Notifications











