నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు, లండన్‌లో ట్రైనింగ్!
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ తెరంగ్రేటం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న జరిగిన శ్రీమన్నారాయణ ఆడియో వేడుకలో ఈ విషయమై క్లారిటీ వచ్చింది. మోక్షజ్ఞ సినీ రంగ ఎంట్రీని ఖరారు చేస్తూ బాలయ్య తన కుమారున్ని వెంట తీసుకొచ్చారు. మరో వైపు యాంకర్ ఉదయభాను కూడా ఈ విషయాన్ని సభా ముఖంగా ప్రకటించింది.
కాగా...బాలయ్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం 2014లో మోక్షజ్ఞ నటించబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంతకంటే ముందుగా మోక్షజ్ఞను లండన్ పంపించి అక్కడ మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట బాలయ్య.
త్వరలో తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తిగా క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లే యోచనలో ఉన్న బాలయ్య తాను సినిమాల్లో ఉన్నప్పుడే మోక్షజ్ఞ భవిష్యత్ కు పునాది వేయాలని యోచిస్తున్నారు. ఈ మేరకు అతను చేయబోయే తొలి సినిమా కథ, దర్శకుడు, స్ర్కిప్టు తదితర విషయాలను బాలయ్యే స్వయంగా దగ్గరుండి చూసుకోనున్నారట. ఏది ఏమైనా తన వారసుడి ఎంట్రీ అదిరి పోవాలని, ఇందుకోసం మంచి సత్తా ఉన్న దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











