Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి షాకింగ్ ట్విస్ట్.. నందమూరి అభిమానే డైరెక్టర్‌గా!
నందమూరి కుటుంబం నుంచి నటవారసుడు మోక్షజ్ఞ తెలుగు పరిశ్రమలో ఎంట్రీకి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్యలో బాలయ్య బాబు కుమారుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత విపరీతంగా బజ్ క్రియేట్ అయింది. దాంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అనే ఎదురు చూపులు మొదలయ్యాయి. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనే వార్తతో అభిమానులు ఆనందపడిపోయారు. అయితే ఆ సినిమా ప్రారంభం ఆలస్యం కావడానికి ఓ కారణం బయటకు వచ్చింది. ఈ రీజన్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత రెండేళ్లుగా మీడియాలో చర్చ జరుగుతున్నది. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే కుటుంబం ఆయను నటనపరమైన శిక్షణ, అలాగే మేకోవర్ తదితర అంశాలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ లుక్‌ను పరిచయం చేసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకొన్నారు.

అయితే హానుమాన్ సినిమా సమయంలో బాలకృష్ణకు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన పాయింట్ నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి బీజం పడింది. ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు. స్క్రిప్టు వర్క్, ఇంకా పలు రకాల పనులు కూడా ఊపందుకొన్నాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో సెట్స్ మీదకు సినిమా వెళ్లాల్సి ఉంది అనే కథనాలు ది మీడియాలో వచ్చాయి.
మోక్షజ్ఞ తొలి సినిమా ప్లానింగ్ అంతా సవ్యంగానే సాగుతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తప్పుకొన్నాడనే విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే క్రియేటివ్, ఇతర విభేదాల కారణంగా మరో డైరెక్టర్‌ను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయడం వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం అయిందని తెలిసింది.

అయితే మోక్షజ్ఞ ఫస్ట్ ఎంట్రీ మూవీకి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారనే విషయం ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. బాలకృష్ణకు మంచి హిట్స్ ఇవ్వడమే కాకుండా నందమూరి అభిమాని కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీకి ఆయనే కరెక్ట్ డైరెక్టర్ అనే అభిప్రాయం కూడా అభిమానుల్లో కలిగింది. త్వరలోనే మోక్షజ్ఞ తొలి చిత్రం గోపిచంద్ డైరెక్షన్లో ప్రారంభం కాబోతున్నదని సమాచారం.
అయితే మోక్షజ్ఞ సినిమా ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. డైరెక్టుగా షూట్ ప్రారంభం చేసి.. ఈవెంట్స్ ద్వారా ప్రమోషన్స్ చేసి భారీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. దర్శకుడి మార్పు తర్వాత నందమూరి వారసుడి ఫస్ట్ మూవీ వేగంగా ముందుకు కదలుతున్నదని విషయం సినీ వర్గాల ద్వారా తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











