Mokshagna Teja: మోక్షజ్ఞకు హ్యాండిచ్చిన ప్రశాంత్ వర్మ!
నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షాకిచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి ఆయనను దర్శకుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. అది మరింత ఆలస్యం కానున్నది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌కు మోక్షజ్ఞను పరిచయం చేయాలని, ప్రతిష్టాత్మకంగా ఆయన సినిమాను ప్రారంభించాలని నందమూరి ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఆ సమయంలో బాలకృష్ణకు కథ చెప్పాలని వెళ్లిని హానుమాన్ సినిమాను భారీ హిట్ చేసిన ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకొన్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగాయి. మోక్షజ్ఞను క్రేజీగా లాంచ్ చేయడానికి పక్కా ప్లాన్ చేసుకొన్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీపై బజ్ క్రియేట్ చేయడానికి లుక్‌ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన లభించింది. బాలయ్య వారసుడి లుక్ చేసిన తర్వాత క్లాస్ అండ్ మాస్ హీరోగా సెట్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపించింది. అయితే అంతా బాగానే జరుగుతుందని, ఫిబ్రవరిలో సినిమాను ఓపెన్ చేయాలని ముహుర్తాలు నిర్ణయించారు. కానీ అనూహ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్త బయటకు వచ్చింది.
అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా మోక్షజ్ఞ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకొన్నారు. దాంతో ఈ సినిమా పట్టాలెక్కే విషయంలో మరింత ఆలస్యం కానున్నది. మరో దర్శకుడితో లాంఛ్ చేయించే పనిలో చిత్ర యూనిట్ ఉంది. సమ్మర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా కోసం హీరో మోక్షజ్ఞ తన ట్రైనింగ్ పనులను పూర్తి చేసుకొంటున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

అయితే మోక్షజ్ఞ సినిమాను వదిలేసిన ప్రశాంత్ వర్మకు ఏకంగా భారీ ఆఫర్ దక్కింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. బ్రహ్మరాక్షసుడు అనే టైటిల్‌ను కూడా ఖారారు చేశారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒకటిగా ఉంటుంది అని చెప్పారు.
ఇదిలా ఉండగా, మోక్షజ్ఞను పరిచయం చేయడానికి బోయపాటి శ్రీనును గానీ, గోపిచంద్ మలినేనిని కానీ దర్శకుడిగా పనిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించి.. గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు డైరెక్టర్‌గా ఎవరు ఉంటారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











