‘రానే వచ్చాడు రామయ్యా’ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ?
హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపు సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య తెర వెనక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కథలు కూడా విన్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో ‘లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించిన సాయి కొర్రపాటి మోక్షజ్ఞ సినిమాను నిర్మించబోతన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన దర్శకుడి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సాయి కొర్రపాటికి చెందిన ‘వారాహి చలన చిత్రం' సంస్థ పేరుతో ‘రానే వచ్చాడు రామయ్యా' అనే టైటిల్ రిజిస్టర్ కావడంతో......ఇది మోక్షజ్ఞ కోసమే అనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.
కాగా...బాలయ్య తనయుడు ఇంకా సినిమా రంగంలోకి ప్రవేశించక ముందే ఆయనకు సినిమా రంగంలో వాడే ట్యాగ్ లైన్లు తగిలించేసారు అభిమానులు. బాలయ్యకు ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో 'నందమూరి నట సింహం' అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞకు 'యంగ్ లయన్' అనే ట్యాగ్ తగిలించారు.
ఆ మధ్య పుట్టినరోజును పురస్కరించుకుని 'యంగ్ లయన్' మోక్షజ్ఞ అంటూ పోస్టర్లు వెలిసాయి. మరో వైపు నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే 'యంగ్ టైగర్' ట్యాగ్‌తో జూ ఎన్టీఆర్ బాగా పాపులర్ అయిన సంగతి. మరి యంగ్ లయన్‌గా రాబోతున్న మోక్షజ్ఞ ఇండస్ట్రీలో...తండ్రి పేరును ఎలా నిలబెడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











