Monalisa: వైరల్ బ్యూటీ మోనాలిసా.. ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి ఆ అదృష్టం మన తలుపు తడితే .. ఎంత దరిద్రమైన దూరమతుంది. కామన్ మ్యాన్ గా కూడా సెలబ్రిటీ మారుతాడు. ఎనలేని క్రేజ్ సంపాదించుకుంటారు. అలా మహాకుంభమేళాలో ఓ ముద్దుగుమ్మ
సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆమె అందానికి యువతే కాకుండా సినీ దర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కూడా కొట్టేసింది. అంతే కాకుండా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటుందట.
ఆ అమ్మడు ఎవరో కాదు. మోనాలిసా (Monalisa). మొన్నటివరకు ఇళ్లిళ్లూ తిరుగుతూ పూసలు అమ్ముకున్న ఈ ముద్దుగుమ్మ.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)లో తన అందమైన కళ్లు, చక్కని చిరునవ్వు అట్రాక్ట్ చేసింది. ఒకే ఒక్క వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసింది. కానీ సోషల్ మీడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమె వీడియో తెగ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. మోస్ట్ ఫేవరేట్ ఇండియన్ సెలబ్రిటి జాబితాలో చేరిపోయింది.

కుంభమేళాలో మోనాలిసాకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాదాపు అన్నీ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యాబర్లు ఆమె ఇంటర్వ్యూల కోసం పరిగెత్తారు. దీంతో ఆ తేనేకళ్ల అమ్మాయి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. తన అందానికి యూతే కాదు సినీ దర్శకులు సైతం ఫిదాయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా (Sanoj Mishra)కు మోనాలిసా బాగా నచ్చేసింది. దీంతో ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. తాజాగా తన మాట నిలబొట్టుకున్నారు. తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.
డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న 'ది డైరీ ఆఫ్ మణిపూర్'లో (The Diary Of Manipur) హీరోయిన్‌గా మోనాలిసాను ఎంపిక చేశారు. ఈ మేరకు సనోజ్ మిశ్రా.. ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిశారు. ఆమె తండ్రికి చిత్ర పరిశ్రమపై ఉన్న సందేహాలను క్లియర్ చేశారు. ఈ క్రమంలో వీరి మధ్య అగ్రిమెంట్ జరిగిందట. పలు మీడియా కథనాల ప్రకారం.. ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా నటించడానికి రూ.21 లక్షల రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లోకల్ బ్రాండింగ్ కోసం మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం మోనాలిసా ముంబయిలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











