twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటి - బాలయ్య సినిమా టైటిల్ ఫిక్స్: అనుకున్న దాన్నే ఫైనల్ చేశారు

    |

    సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్‌ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. వరుస పరాజయాలతో బాధ పడుతోన్న ఆయన ఈ మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    ఇందులో భాగంగానే బాలకృష్ణ తన సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ పేరు గతంలోనే వినిపించింది. కానీ, ఇది నెగెటివ్ అర్థం వచ్చేలా ఉందని చిత్ర యూనిట్ వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రానికి 'సూపర్‌మేన్' అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదట అనుకున్న 'మోనార్క్'కే బాలయ్య ఓటేసినట్లు తాజా సమాచారం. ఇందులో ఆయన పాత్ర చిత్రన ప్రకారమే ఈ టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

    Monark Fix for Boyapati Srinu - Nandamuri Balakrishna Movie

    ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా, రెండోది అఘోరా రోల్ అని అంటున్నారు.. అలాగే, ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఇక, ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అలాగే, అందులో బాలయ్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది.

    English summary
    Balakrishna's fans have been raved with 'Superman' title. In contrast Nag Ashwin and Prabhas are buzzed to have been shocked with Balayya's film title. It's now assumed by movie folks that extreme levels of heroism will be shown in both Prabhas and Balayya's films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X