Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బోయపాటి - బాలయ్య సినిమా టైటిల్ ఫిక్స్: అనుకున్న దాన్నే ఫైనల్ చేశారు
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. వరుస పరాజయాలతో బాధ పడుతోన్న ఆయన ఈ మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే బాలకృష్ణ తన సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ పేరు గతంలోనే వినిపించింది. కానీ, ఇది నెగెటివ్ అర్థం వచ్చేలా ఉందని చిత్ర యూనిట్ వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రానికి 'సూపర్‌మేన్' అనే టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదట అనుకున్న 'మోనార్క్'కే బాలయ్య ఓటేసినట్లు తాజా సమాచారం. ఇందులో ఆయన పాత్ర చిత్రన ప్రకారమే ఈ టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి పవర్ఫుల్ రైతు పాత్ర కాగా, రెండోది అఘోరా రోల్ అని అంటున్నారు.. అలాగే, ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్గా ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఇక, ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అలాగే, అందులో బాలయ్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది.