మహేష్ కంటే పవన్ కళ్యాణే యమా దూకుడుమీద ఉన్నాడు....

By Sindhu

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బాగా ఖుషీగా కనిపించే సమయం ఇది. బికాజ్, తన సినిమాల పట్ల పవన్ తీరు మారిందనీ..తన జోరు పెరిగిందనీ స్పష్టమైన సంకేతాలనందిస్తోంది 'లవ్ ఆజ్ కల్" రీమేక్. జయంత్ డైరెక్షన్ లో పవన్ ఇస్తోన్న ఈ చిత్రం కోసం ఇటీవల కాశీలో ఓ షెడ్యూల్ చేసిన విషయం మీకూ విదితమే. దాదాపు నెల రోజుల పాటు నిరవధికంగా జరిగిన ఆ కాశీ షెడ్యూల్ లో రెండు పాటలతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణను శరవేగంగా జరిపారు. కాగా ఈ సినిమా వర్క్ ఇంత స్పీడ్ గా జరగడానికి పవన్ కళ్యాణే ముఖ్య కారకుడనీ..ఈ వారణాసి షెడ్యూల్ కోసం పవన్ చేసిన హార్డ్ వర్క్, పవన్ చూపిన డెడికేషన్ అమోఘమనీ అభినందనలు కురిపిస్తున్నారు చిత్ర దర్శకుడు జయంత్.

పగలు రాత్రి అనక కష్టపడుతూ 24గంటలూ సెట్ లోనే వుంటూ పవన్ కళ్యాణ్ అందిస్తోన్న సహకారం వలనే అనుకున్నదానికంటే వేగంగా ..అద్బుతంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని జయంత్ అంటున్నారు. అన్నట్టు..ఇప్పటికే కాశీలో, అలహాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం పవన్ -త్రిషలపై టాకీ పార్ట్ తో బాటు మరో రెండు పాటలని చిత్రీకరించేందుకై యూనిట్ అంతా ఇప్పడు 'ఖుషీగా" న్యూజిలాండ్ కి వెళుతోంది. విశేషం ఏంటంటే..ఈ న్యూజిలాండ్ షెడ్యూల్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో న్యూ లుక్ తో రెడీ అయ్యారట..ఆ పవర్ ఫుల్ గెటప్ ఫెంటాస్టిక్ గా వుందట.

ఇదిలా ఉండగా మహేష్ కూడా ఖలేజా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, యమా 'దూకుడు" తో షూటింగ్ లో పాల్గొంటూ త్వరత్వరగా షూటింగ్ లు పూర్తి చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X