బాలయ్యకి మరో నరసింహానాయుడుని ఇస్తాడంట...

By Sindhu

సింహా అందించిన ఉత్సాహంతో మరింత వేగంగా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ అప్పుడే 'పరమవీరచక్ర" చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేశారు. దాసరి నారాయణరావు తనదైన శైలిలో ఈ చిత్రాన్నిదాదాపుగా పూర్తి చేశారు. దాసరి నారాయణరావు తనదైన శైలిలో ఈ చిత్రాన్ని వాయువేగంతో చుట్టేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందే చిత్రానికి కూడా బాలయ్య సైమల్టేనియస్ గా డేట్స్ ఇచ్చారు. 'పరమవీర చక్ర" సంక్రాంతికి, పరుచూరి మురళి సినిమా సమ్మర్ కీ విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత బాలకృష్ణ తన ఫేవరెట్ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్ లో ఒక పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.

బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రానికి సబ్జెక్ట్ కూడా రెడీ అయినట్టు సమాచారం. 'హర హర మహాదేవ" అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఈ చిత్రం కోసం బెల్లంకొండ రిజిస్టర్ చేశారు. 'సమరసింహారెడ్డి", 'నరసింహానాయుడు" వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం 'పలనాటి బ్రహ్మనాయుడు" దారుణ పరాజయం చవిచూసింది. అయితే ఆ ఒక్క చిత్రంతో వీళ్లిద్దరి కలయికపై ఉండే క్రేజ్ ఢోకా లేదనాలి. ఆ పరాభవాన్ని మరిపించేలా, తమ కలయికలో వచ్చిన ఘన విజయాలను తలదన్నేలా 'హర హర మహాదేవ" చిత్రం తెరకెక్కాలని, బి గోపాల్ అందుకోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని తెలిసింది. అయితే బి గోపాల్ కి డేట్స్ ఎప్పుడు ఇచ్చేదీ స్పష్టం చేయకుండా బాలకృష్ణ మధ్యలో 'శ్రీరామరాజ్యం" మొదలు పెట్టడంతో 'హరహర మహేదేవ" సస్పెన్స్ లో పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X