స్వల్ప అస్వస్ధతతో చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరి డిశ్చార్జి అయిన రంభ ఒక ప్రముఖ నటి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఉపవాసం చేసిన తర్వాత పుల్లగా ఉండే పులిహోర తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడంతో తాను ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరితే కనీస మానవత్వం లేకుండా ఒక నటి దుష్ప్రచారం చేయడం దారుణమని రంభ వాపోతోంది.అసలు విషయం ఏమిటంటే రంభ భోజ్ పురి చిత్రాల్లో ఈమధ్య బిజీగా ఉంది. ఆ రంగంలో చాలా కాలం టాప్ స్ధానంలో ఉన్న నగ్మా రంభను దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందట. నగ్మా పేరు చెప్పకుండా ఈ విషయాన్ని రంభ వివరించింది. భోజ్ పురి హీరో తో ప్రేమాయణం విఫలం కావడం వల్లనే రంభ ఆత్మహత్యకు ప్రయత్నించిందని పత్రికల్లో వార్తలు రావడం వెనుక నగ్మా హస్తం ఉందని రంభ అనుమానించడంలో ఆశ్చర్యం లేదు.