నాగ్ కి మనశ్శాంతి లేదా?
ఎప్పుడూ కూల్ గా ఉండే నాగార్జున ఈ మధ్య చాలా విసుగ్గా, అసహనంతో ఉంటున్నాడని వినపడుతోంది. అది తన డాన్, కింగ్ చిత్రాలు వర్కవుట్ కాకపోవటం వలనా, లేక తన మేనళ్ళల్లు సుమంత్ (బోణి), సుశాంత్(కరెంట్) చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోకపోవటం వలనా అనేది అర్ధం కావటం లేదంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం అదేం కాదు తన కుమారుడు నాగచైతన్య జోష్ చిత్రం ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచనతో తండ్రిగా టెన్షన్ ఫీలయి అలా విసుగ్గా ఉంటున్నాడని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆయన వాటా పెట్టిన మా టీవీ బాగా డల్ అవటం, తను ఎక్కువ పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ కుదేలవటం ఆయన్ని ఆలోచనలో పడేస్తోందంటున్నారు. అలాగే తమ అన్నపూర్ణ బ్యానర్ పై చేస్తున్న రెండు టీవీ సీరియల్స్ పరిస్ధితి అయోమయంగా ఉందని ఇవన్నీ ఆయన్ని నిరంతరం ఆలోచనలో పడేస్తున్నాయంటున్నారు. ఏది ఎలా ఉన్నా ప్లానింగ్ ప్రకారం వెళ్ళే నాగార్జునకి ఈ ఆటు పోట్లు కొద్దిరోజులే త్వరలోనే మళ్ళీ ఓ సూపర్ హిట్ తో ముందుకొస్తాడంటున్నారు.


Click it and Unblock the Notifications











