Mouni Roy: మౌనీ రాయ్ విడాకులు.. డివోర్స్‌పై రెండ్రోజులకే ఊహించని ట్విస్ట్!

చిత్ర పరిశ్రమలో నటీనటుల విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం నాగిన్ సీరియల్ ఫేమ్, నటి మౌనీ రాయ్ విడాకుల ప్రకటన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నామంటూ నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఆమె ముగింపు పలికారు. అయితే రెండ్రోజులు తిరగకుండానే మౌనీ రాయ్ దంపతులు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

నాగిన్ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మౌనీ రాయ్ ఆ తర్వాత సినిమాలలో ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా మారారు. హిందీతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 1లో స్పెషల్ సాంగ్ చేశారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన బ్రహ్మాస్త్రలో నెగిటివ్ రోల్‌లో అలరించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న విశ్వంభరలో చిరంజీవితో కలిసి స్టెప్స్ వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇవికాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్‌లో ఆమె పేరు వినిపిస్తోంది.

Mouni Roy Divorce Actress Reunites With Husband Suraj Nambiar

వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో 2019లో మౌనీరాయ్‌కి పరిచయం ఏర్పడి ఇది ప్రేమగా మారింది. మూడేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేసిన అనంతరం 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. సూరజ్ తన బిజినెస్‌తో, మౌనీరాయ్ సినిమాలతో బిజీగా ఉంటున్నప్పటికీ వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధులు చోటు చేసుకుంటున్నాయని, విడిగా ఉంటున్నారని బాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మౌనీరాయ్ తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వివరాలను క్రమం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తారు. అలాంటిది గత కొంతకాలంగా తన సోషల్ మీడియా పోస్టులలో సూరజ్ ఫోటోలు కనిపించలేదు. అటు సూరజ్ కూడా మౌనీరాయ్‌తో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.

అయితే వీటిని మౌనీరాయ్ ఖండించారు. తన భర్తతో విడాకుల గురించి మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమని కౌంటరిచ్చారు. కానీ గంటలు తిరగకుండానే సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు నటి. మా జీవితాన్ని సంచలనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తమ కెరీర్ ప్రాధాన్యతలపై లోతుగా ఆలోచించిన తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా ఆమె వెల్లడించారు. దీంతో అభిమానులు, సినీ వర్గాలు షాక్ అయ్యాయి.

ఇది జరిగి రెండు నెలలు కాకుండానే మౌనీరాయ్ - సూరజ్ నంబియార్‌ల విడాకుల వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. విడాకులకు ముందు వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో అన్‌ఫాలో చేసుకున్నారు. అయితే తాజాగా ఈ జంట మళ్లీ ఒకరి ఖాతాలను మరొకరు అనుసరిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారగా.. మౌనీరాయ్- సూరజ్‌లు విడాకుల విషయంలో పునరాలోచించి వెనక్కి తగ్గారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. వీరిద్దరూ తిరిగి ఒక్కటవ్వాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

Read more about: mouni roy suraj nambiar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X