Vishwambhara సాంగ్‌కి మౌనీరాయ్‌కి రికార్డ్ రెమ్యునరేషన్.. 5 నిమిషాల పాటకు ఎన్ని కొట్లంటే?
ఓ సినిమాను హిట్ కావాలంటే ఇందుకు ఎన్నో అంశాలు కారణమవుతాయి. కథ, కథనాలతో పాటు పాటలు కూడా సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఐటెం సాంగ్స్ హవా నడుస్తోంది. ఒకరిని చూసి ఒకరు తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ని ఇరికిస్తున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల పారితోషికాలను ఆఫర్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభరలో నాగిని ఫేం మౌనీరాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్‌తో విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 156వ సినిమాగా సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, రావు రమేష్, శుభలేక సుధాకర్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

విశ్వంభరపై లేని బజ్
ఎప్పుడో ప్రారంభమైన విశ్వంభర షూటింగ్ అనివార్య కారణాలతో ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీపై బజ్ కూడా లేకపోవడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కంటే వెనుక మొదలైన అనిల్ రావిపూడి- చిరంజీవిల మెగా 157పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ కానీ కనీసం పోస్టర్ కూడా రిలీజ్ కాకుండానే మెగా 157కి భారీ హైప్ రావడానికి కారణం అనిల్ రావిపూడి. లాంచింగ్ ఎపిసోడ్, నయనతారతో స్పెషల్ వీడియోతో ఆయన అంచనాలను పెంచేశారు. అన్నింటికి మించి నయనతారను ప్రమోషన్ కార్యక్రమానికి రప్పించడంలోనే ఆయన సక్సెస్ అయ్యారు.
చిరు పక్కన మౌనీరాయ్ స్టెప్పులు
కానీ విశ్వంభర పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. టీజర్‌ను రిలీజ్ చేసినప్పటికీ దానిపై బోల్డెంత నెగిటివిటీ, ట్రోలింగ్ నడిచింది. దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్ మొత్తం మార్చి కొత్తగా తీసుకొచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మాస్‌ను ఆకట్టుకునేందుకు గాను ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. దీనికి తొలుత మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అనివార్య కారణాలతో తమన్నా తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలా? అని చిత్ర యూనిట్ తల పట్టుకుంది. చివరికి బాలీవుడ్ నటి, నాగిని ఫేమ్ మౌనీరాయ్‌కి మెగాస్టార్ పక్కన స్టెప్పులు వేసే ఛాన్స్ దక్కింది.
మౌనీరాయ్ రెమ్యునరేషన్ ఎంత?
తాజాగా ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసి విశ్వంభరకు గుమ్మడికాయ కొట్టేశారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో .. భీమ్స్ ఈ సాంగ్‌కి సంగీతం అందించాడు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు ఏఎస్ ప్రకాష్ భారీ సెట్ వేశాడు. ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇకపోతే.. విశ్వంభరలో ఐటెం సాంగ్ కోసం మౌనీరాయ్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం.. మౌనీరాయ్‌కి ఈ ఐటెం సాంగ్ చేసినందుకు గాను 50 లక్షల రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











