అన్నా హజారేపై మురుగదాస్ సినిమా!
అన్నా హజరే చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమానికి దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో.....హజారే ఉద్యమాన్ని బేస్ చేసుకుని ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ ఇందుకు సంబంధించిన స్ర్కిప్టుతో రెడీగా ఉన్నట్లు తెలుస్తూంది. ఇది భారీ బడ్జెట్ కావడంతో ఆ ఖర్చును భరించ గలిగే నిర్మాతల కోసం మురగదాస్ ఎదురుచూస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమాను ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ వర్షన్ లలో విడుదల చేసేందుకు మురుగ స్కెచ్ వేస్తున్నటు సమాచారం.
ఈ విసయం తెలుసుకున్న పలువురు సీనిస్టార్లు ఇందులో నటించేందుకు పోటీ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నా హజారేకు మద్దతుగా ఇప్పటికే టాలీవుడ్ లో మౌన ప్రదర్శనలు, కోలీవుడ్ లో దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అన్నట్టు అన్నా హజారే మద్దతు తెలుపడానికి సీనీస్టార్లు ఇంతలా పోటీ పడటానికి...మంచి పబ్లిసిటీ దక్కుతుండటమే కారణమట.


Click it and Unblock the Notifications











