twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేట్లు పెచేందుకు సిద్దమైన ఏపీ ప్రభుత్వం.. కానీ ఆ విషయంలోనే అసలు సమస్య?

    |

    ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధరల సమస్య చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమను కలవర పెడుతోంది. అయితే ఈ విషయంలో కొంత పాజిటివ్ సూచనలు అయితే వచ్చాయి. సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్ల వర్గీకరణపై ప్రభుత్వం ఒక కమిటీ నియమించారు. 13 మంది సభ్యుల ఈ కమిటీ జనవరి 11న ఏపీ సచివాలయంలో భేటీ అయింది. ఏపీ హోంశాఖ సెక్రటరీ విశ్వజిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక నేరుగా చిరంజీవి రంగంలో దిగడంతో రేట్లు పెంచడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కానీ ఇక్కడే మరో సమస్య ఉందని చెబుతున్నారు. అసలు ఏంటా సమస్య? అనే వివరాలు పరిశీలిస్తే

    జగన్ తో భేటీ

    జగన్ తో భేటీ


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సినిమా టికెట్ ధరల తగ్గింపు పై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. త్వరలో శుభవార్త వింటారని కూడా వెల్లడించారు.

    త్వరలో గుడ్ న్యూస్

    త్వరలో గుడ్ న్యూస్

    ఈ క్రమంలో సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్ల వర్గీకరణపై ప్రభుత్వం ఒక కమిటీ నియమించారు. 13 మంది సభ్యుల ఈ కమిటీ జనవరి 11న ఏపీ సచివాలయంలో భేటీ అయింది. ఏపీ హోంశాఖ సెక్రటరీ విశ్వజిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. టికెట్ రేట్ల తగ్గింపుతో థియేటర్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని ఎగ్జిబిటర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నిజానికి ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని తెలుగు ఫిల్మ్ చాంబర్ కూడా కొద్దిరోజుల క్రితమే వెల్లడించింది. దాదాపు 3 గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. అన్ని సెంటర్లలోనూ టికెట్ ధరలు పెంచాలని కోరిన‌ట్టు తెలిపారు.

    మల్టీప్లెక్స్‌లు కూడా

    మల్టీప్లెక్స్‌లు కూడా

    అయితే ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచే విధంగా ముందుకు వెళ్లనుంది. సినిమా హాళ్లలో రూ.150, 100, 50 ధరల శ్లాబ్‌ను అనుమతించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. అయితే మల్టీప్లెక్స్‌లలో కూడా టిక్కెట్‌ల ధర రూ.150కి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మల్టీప్లెక్స్‌లు 150 రూపాయలకు టిక్కెట్‌లను విక్రయిస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్లను నమోదు చేయడం కష్టం అని అంటున్నారు.

    మంచి నిర్ణయం తీసుకునేలా

    మంచి నిర్ణయం తీసుకునేలా

    అయితే ఏపీలో మల్టీ ప్లెక్స్ లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లే ఎక్కువ ఉంటాయి. ఈ క్రమంలో మల్టీ ప్లెక్స్ ల వారు నష్టపోయినా ఇబ్బంది లేదని సింగిల్ ధియేటర్ యజమానులు భావిస్తున్నారు. కానీ సినీ రంగానికి చెందిన ప్రతినిధులు మల్టీ ప్లెక్స్ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఎలాంటి రేట్లు పెట్టినా

    ఎలాంటి రేట్లు పెట్టినా


    అయితే ఒకరకంగా టాలీవుడ్ ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంది. అందుకే ప్రభుత్వం ఎలాంటి రేట్లు పెట్టినా ప్రస్తుతానికి ముందుకు వెళ్లే యోచనలోనే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ, మల్టీప్లెక్స్‌లలో ఫ్లెక్సిబుల్ ధరలను చర్చించడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలకు ఇది కీలకమైన అంశం. అయితే మల్టీ ఫ్లెక్స్ లో కూడా 150 గరిష్ట ధర పెట్టినా సరే ముందుకు వెళ్ళడానికి యోచిస్తున్నారు.

    English summary
    Movie Ticket Rates Issue To Be Solved In AP But another issue raised
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X