బాలయ్యకు దూరంగా...చిరంజీవికి దగ్గరగా?

By Bojja Kumar

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో బెల్లకొండ సురేష్ ఒకరు. బెల్లంకొండకు మొదటి నుంచి ఇండస్ట్రీలో ఎక్కువ అనుబంధం ఉంది ఎవరితో అంటే? ముందుగా వినిపించేది నందమూరి హీరో బాలయ్య పేరు. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, లక్ష్మి నరసింహా లాంటి భారీ చిత్రాలు నిర్మించి పాపులర్ ప్రొడ్యూసర్ గా మారారు బెల్లంకొండ. బాలయ్యకు బెల్లంకొండ వీరాభిమాని. ఆ మధ్య కాల్పుల ఘటన జరిగిన తర్వాత కూడా బాలయ్య-బెల్లంకొండ బంధం కొనసాగుతుండటం, బాలయ్య హీరోగా భీష్మ, హర హర మహదేవ చిత్రాలు చేయడానికి ఆయన ముందుకు రావడం అందరినీ ఆశ్యర్య పరిచింది.

ఆ రెండు చిత్రాల(భీష్మ, హరహర మహదేవ) గురించి భారీగా ప్రకటించిన తర్వత...రద్దు కావడంపై బెల్లంకొండ చాలా డిసప్పాయింట్ గా ఉన్నారని, ఇక క్రమక్రమంగా బాలయ్యకు దూరం అవుతున్నారనే వాదన ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే... బెల్లకొండ మెగా కుటుంబానికి దగ్గరవుతున్నారని, కొంత కాలంగా చిరంజీవితో సన్నిహితంగా మెలుగుతూ మెగా హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరోల నుంచి కూడా బెల్లంకొండకు సానుకూల సంకేతాలు అందాయని చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X