‘మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం’??

By Sindhu

ప్రకాష్‌ రాజ్, భూమిక జంటగా నటిస్తోన్న చిత్రానికి 'మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం" అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై టేకుల కృపాకరరెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కొంతకాలం దాసరి నారాయణరావు దగ్గర పనిచేసి, విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

దర్శకుడు కృపాకరరెడ్డి మాట్లాడుతూ ప్రకాష్‌రాజ్ కలెక్టర్‌గా, భూమిక ఎం.బి.ఎ. చదివిన గృహిణిగా ఇందులో నటిస్తోంది. భార్యాభర్తలైన వీరిద్దరి మధ్య తరగని కీచులాటలు వారి జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చాయనేదే చిత్ర కథాంశమని చెప్పారు. లేడీ ఓరియెంటేడ్ మూవీగా రూపొందుతోన్న ఇందులో భూమిక ఆస్పత్రిలో చేరే సన్నివేశాల్ని బుధవారంనాడు హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా సినీవిలేజ్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. నవంబర్‌లో మిగిలిన టాకీ, డిసెంబర్‌లో పాటల చిత్రీకరణతో చిత్రం పూర్తవుతుందని, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కామెడీ పార్ట్ హైలైట్‌గా ఉంటుందన్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనేది ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భూమిక మాట్లాడుతూ.. మంచి కథాంశంతో కూడిన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని పేర్కొంది. సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఇంకా ఈ చిత్రంలో శివపార్వతి, ఢిల్లీ రాజేశ్వరి, వైజాగ్ ప్రసాద్, వేణుమాధవ్, బాబూమోహన్, ధర్మవరపు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X