ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' ఆ హిందీ చిత్రానికి కాపీనా?
ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ పర్‌ఫెక్ట్'. కె. దశరథ్ దర్శకత్వంలో సహ నిర్మాతలుగా శిరీష్-లక్ష్మణ్ వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతోంది. అయితే ఈ చిత్రంపై ఫిల్మ్ సర్కిల్స్ లోనూ బయిటా ఓ రూమర్ వినపడుతోంది. ఈ చిత్రం రణబీర్ కపూర్ నటించిన బచానా హిందీ చిత్రం ఏ హసీనో కి ప్రీమేక్ వెర్షన్ అంటున్నారు. ఈ చిత్రంలో కూడా హీరో హీరోయిన్ ప్రేమను కాదనుకుని వెళ్ళి సెకెండ్ హీరోయిన్ వెనకపడి ఆమె కాదంటే ప్రేమ విలువ తెలుసుకుని మొదటి హీరోయిన్ దగ్గరకి రావటం జరుగుతుందని అంటున్నారు. గతంలో కూడా దశరధ్..కుచ్ కుచ్ హోతా హై చిత్రం ప్రేరణతో సంతోషం చిత్రం రూపొందించి హిట్టు కొట్టారు. ఇక దిల్ రాజు ఈ చిత్రం గురించి చెపుతూ. ఒక కొత్త పాయింట్ ద్వారా అల్లిన కథే మిస్టర్ పర్‌ఫెక్ట్. దర్శకుడు దశరథ్, బాబీ, సాల్మన్ ఎంతో కష్టపడి స్క్రిప్టును తయారుచేశారు. అబ్బూరి రవి అద్భుతంగా డైలాగులు రాశారు. తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఇందులో హీరో ప్రభాస్ కొత్త గెటప్‌లో అభిమానులను అలరించబోతున్నాడు అన్నారు.అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











