‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ నీ లవర్ బాయ్ లుక్ అంత ఫర్ ఫెక్ట్ గా లేదు...
'మిస్టర్ ఫర్ ఫెక్ట్" ని అంటూ త్వరలో మన ముందుకి రాబోతున్న ప్రభాస్ ఈ చిత్రం కోసం ఒక కొత్త లుక్ ని ట్రై చేశాడు. డిఫరెంట్ లుక్ అనగానే జుట్టు పెంచడమో, తగ్గించడమో చేసే మన హీరోలందరిలానే తను కూడా అంత కత్తెర వేయించుకుని, స్పైక్స్ తో నిజంగానే కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే కొత్త అయిన ప్రతీది బాగుండాల్సిన అవసరం లేదు కనుక ఈ గెటప్ కూడా అలానే బాలేదు. అసలే ఈ మద్య డల్ గా కనిపిస్తున్న ప్రభాస్ ఈ లుక్ తో మరింత నీరసంగా కనిపిస్తున్నాడు.
మాచో మ్యాన్ అయిన ప్రభాస్ మరీ లవర్ బాయ్ లుక్ ట్రై చేస్తే చూడడానికి ఇబ్బంది ఉంది. ప్రభాస్ ఇలా డిఫరెంట్ లుక్స్ ట్రై చేసినప్పుడల్లా దెబ్బతిన్నాడు. మున్నా, యోగి సినిమాలో తన ఉంగరాల జుట్టుని స్ట్రైయిట్ చేయించుకుని కొత్తదనం కోసం పాకులాడితే చెత్తగా ఉందనే విమర్శలొచ్చాయి. ఇప్పుడీ ఫర్ ఫెక్ట్ గెటప్ కూడా ఫర్ ఫెక్ట్ అనించుకోలేక మళ్లీ ప్రభాస్ కి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. కనీసం సినిమా రిజల్ట్ అయినా ప్రభాస్ కోరుకున్నట్టు ఫర్ ఫెక్ట్ గా ఉంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











