పాపం పూజా- రష్మిక!.. మృణాల్-శ్రీలీల గ్యాప్ లేకుండా ఓ ఆట ఆడేసుకుంటున్నారుగా!
యంగ్ హీరోయిన్స్ శ్రీలీల, మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఊపులో ఉన్నారు. కెరీర్లో ఫుల్ జోష్‌లో దూసుకెళ్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్.. పూజాహెగ్డే, రష్మికకు తలనొప్పిగా మారినట్టు అనిపిస్తోందని తెలుస్తోంది. వివరాళ్లోకి వెళితే..
కొత్త సరుకు ఎప్పుడూ..: సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. కొత్త సరుకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కొత్తదనానికి.. కొత్త అందాలకు.. ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతిస్తుంది టాలీవుడ్. అందుకే ఎప్పటికప్పుడు కొత్త వారు వస్తూనే ఉంటారు. వారి అదృష్టం బాగుంటే ఒక్క సినిమాతో స్టార్‌గా మారిపోయి వరుస అవకాశాలను అందుకుంటుంటారు. అయితే కొత్త వారు రావడంతో పాత వారికి క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోతుంటాయి. కొన్ని సార్లు వారికి వచ్చిన ఛాన్స్‌లు కూడా మధ్యలో వదిలేసి వెళ్లిపోతుంటాయి. దీంతో వారి కెరీర్ సందిగ్ధంతో పడిపోతుంది. దీంతో చెసేదేమిలేక మెల్లమెల్లగా అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుంటుంది. ఇప్పుడు పూజాహెగ్డే పరిస్థితి అలానే కనపడుతోంది. రష్మిక ఆ జాబితాలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

అన్నీ శ్రీలీలకే..: పూజాహెగ్డే.. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లను అందుకుంటూ దూసుకెళ్లింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంది. కానీ ఈ ముద్దుగమ్మకు గతేడాది నుంచి కలిసి రావట్లేదు. ప్రభాస్ 'రాధేశ్యామ్'తో మొదలై.. 'బీస్ట్' , 'ఆచార్య', హిందీ చిత్రాలు 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' అన్ని బాక్సాఫీస్ వద్ద అన్నీ డిజాస్టర్‌గా నిలిచాయి. అలా గతేడాది నుంచి గ్యాప్ లేకుండా ఐదు పరాజయాలను అందుకంది. దీంతో దర్శక నిర్మాతలు ఆమెను కాస్త పక్కకి పెట్టినట్టున్నారు. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ VD 12లో పూజాను తప్పించి శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు.

రష్మిక పరిస్థితి కూడా..: ఇక నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక కూడా ఒకప్పుడు తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రతి సినిమాలోనూ ఆమె పేరే వినిపించేది. ఆ వచ్చిన క్రేజ్ బాలీవుడ్‌లోనూ రాణించాలని అక్కడి సినిమాలకు సైన్ చేయడం మొదలుపెట్టింది. ఈ గ్యాప్‌లో తెలుగుపై ఫోకస్ కాస్త తగ్గించింది. అక్కడ సినిమాలు బోల్తా కొట్టాయి. ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అయినా నితిన్‌తో నటించేందుకు ఓ అవకాశం ఇచ్చారు మేకర్స్. అది కూడా రీసెంట్గా చేజారిపోయింది. శ్రీలీల దానిని ఎగరేసుకుపోయింది.

శ్రీలీలీ-మృణాల్ జోరు..: అలా పూజా హెగ్డే, రష్మికకు ఇద్దరికి తెలుగులో ఛాన్సులు తగ్గాయి. అదే సమయంలో యంగ్ బ్యూటీ శ్రీలీల జోరు పెరగడంతో అవకాశాలన్ని ఆమెకు వస్తున్నాయి. ఇప్పుడు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హవా కూడా నడుస్తుంది. శ్రీలీల అంత ఫాస్ట్ గా కాకపోయినా టాలీవుడ్ లో పాగా వేస్తుందీ ముద్దుగుమ్మ. ఇప్పటికే నాని 'హాయ్ నాన్నా', విజయ్ దేవరకొండతో VD 13 సినిమా ఛాన్స్‌ను అందుకుంది. బుచ్చిబాబు సినిమాలో కూడా ఈమె నటించనుందని అంటున్నారు.

వరుసగా అవకాశాలు..: మరోవైపు బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవరలో నటిస్తోంది. బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా మృణాల్ తో పాటు ఈమె పేరు కూడా వినిపిస్తోంది. మొత్తంగా దర్శకనిర్మాతలందరూ పూజా, రష్మికను పక్కకు పెట్టి మృణాల్, శ్రీలీలపైనే ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత జాన్వీని ట్రై చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తెలుగులో రష్మిక, పూజా కెరీర్ వాషౌట్ దశకు చేరుకుంటుందని ప్రచారం సాగుతోంది. పాపం పూజా- రష్మిక.. మృణాల్-శ్రీలీల గ్యాప్ లేకుండా ఛాన్స్‌లు అందుకుంటూ ముందుకెళ్లిపోతున్నారుగా అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











