Mrunal Thakur: ధనుష్ కాదు.. మృణాల్ ఠాకూర్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరంటే?

Mrunal Thakur: దక్షిణాది సినిమాల నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ అమ్మడు పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వరకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఆమె పెళ్లి జరగబోతోందంటూ నెట్టింట పెద్ద ఎత్తున పుకార్లు ప్రచారం అయ్యాయి. ఫిబ్రవరిలో వీరిద్దరూ ఏడడుగులు వేయనున్నారనే వార్తలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమార్స్‌కు చెక్ పెట్టేలా తాజాగా బయటకు వచ్చిన కొన్ని వీడియోలు, ఫోటోలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. ఇంతకీ ఏం జరిగింది?

ఈ పెళ్లి పుకార్లు చల్లారకముందే.. తాజాగా మరో కొత్త పేరు తెర పైకి వచ్చింది. యంగ్ హీరోతో మృణాల్‌ డేటింగ్‌లో ఉందన్న ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది. ఈ హీరోతో మృణాల్ డేటింగ్‌లో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడంతో ఈ గాసిప్ మరింత బలపడింది. ఒకప్పుడు ధనుష్‌తో లింక్ చేసిన నెటిజన్లు, ఇప్పుడు సిద్ధాంత్ వైపు తమ దృష్టిని మళ్లించారు.

Mrunal Thakur Dating Siddhant Chaturvedi Dhanush Rumours Fade New Bollywood Love Buzz

నిన్నటి నుంచి ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. తొలుత చాలామంది దీనిని కేవలం గాసిప్‌గా భావించినా, వరుసగా వస్తున్న అప్డేట్స్ చూసి 'ఇది కేవలం రూమర్ మాత్రమే కాదేమో' అన్న అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన తాజా మూవీ 'దో దీవానే సేహర్ మేన్'త్వరలో విడుదలకు సిద్ధమవుతుండటమే ఈ పుకార్లకు మరింత ఊపునిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 2026లో థియేటర్లలోకి రానుంది.

సినిమా ప్రమోషన్ల సమయంలో మృణాల్-సిద్ధాంత్ మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి కనిపించగా, చాలా క్లోజ్ గా , ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కనిపించారు. వారిద్దరి అలా చూసిన కొంతమంది నెటిజన్లు 'ఇది సినిమాకే పరిమితమా? లేక నిజ జీవితానికీ సంబంధమా?' అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు.

అయితే.. ఈ పుకార్లుకు మరింత ఊతమిచ్చింది సిద్ధాంత్ చతుర్వేది చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా టైటిల్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి, "దో దీవానే.." అనే చిన్న క్యాప్షన్‌తో రీల్ షేర్ చేయడంతో, ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. ఇది సినిమా ప్రమోషన్‌లో భాగమేనా? ఇక ఏమైనా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఇక దో దీవానే సేహర్ మేన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు దర్శకుడు రవి ఉద్యావర్. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, నిజ జీవిత ప్రేమలో ఉండే భావోద్వేగాలు, అయోమయాలు, లోపాలను చూపించడమే ఈ సినిమా లక్ష్యమని ఆయన చెబుతున్నారు. జీ స్టూడియోస్, భన్సాలి ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మృణాల్-సిద్ధాంత్ జంట మధ్య కెమిస్ట్రీ, సినిమాకే కాకుండా వారి వ్యక్తిగత జీవితాలపైనా ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఈ డేటింగ్ పుకార్లపై ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ గానీ, సిద్ధాంత్ చతుర్వేది గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమైన ప్రేమకథా? లేక సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం మాత్రం మృణాల్ ఠాకూర్-సిద్ధాంత్ చతుర్వేది జంట బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X