ధనుష్ తో డేటింగ్ రూమర్స్ వేళ..మృణాల్‌కు మరో స్టార్ హీరో ఊహించని సర్‌ప్రైజ్!

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur). కొన్ని రోజులుగా ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ ధనుష్ తో ప్రేమ వ్యవహారం ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ధనుష్ తో ఆమె పెళ్లి జరగబోతోందంటూ నెట్టింట పెద్ద ఎత్తున పుకార్లు ప్రచారం అయ్యాయి. ఫిబ్రవరిలో వీరిద్దరూ ఏడడుగులు వేయనున్నారనే వార్తలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ రూమర్స్‌కు ఆమె టీమ్ అప్పట్లో క్లారిటీ ఇచ్చినా... తాజాగా వచ్చిన ఓ వీడియో మళ్లీ నెటిజన్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ పుకార్లకు చెక్ పడకముందే .. తాజాగా మరో కొత్త పేరు తెర పైకి వచ్చింది. యంగ్ హీరోతో మృణాల్‌ డేటింగ్‌లో ఉందన్న ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు..బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ చతుర్వేది (Siddhant Chaturvedi). ఇటీవల వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో మీడియా కంటపడటం ఈ గాసిప్ మరింత బలపడింది. ఒకప్పుడు ధనుష్‌తో లింక్ చేసిన నెటిజన్లు, ఇప్పుడు సిద్ధాంత్ వైపు తమ దృష్టిని మళ్లించారు.

Mrunal Thakur Dating Rumours

సిద్దార్థ చతుర్వేది - మృణాల్‌ ఠాకూర్ వీరిద్దరూ కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా 'దో దీవానే సేహర్ మేన్'ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో సిద్ధాంత్... ఒకసారి కాదు, రెండుసార్లు మృణాల్‌పై పూల వర్షం కురిపించాడు. మొదట ఆమె అభిమానులతో మాట్లాడుతున్న వేళ, ఆ తర్వాత స్టేజ్‌పై కూడా పూలతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ మొత్తం ఘట్టాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.

వీడియో చూసిన అభిమానులు 'ఇది స్నేహమా? ఇంకేదైనా స్టార్టయ్యిందా?' అంటూ కామెంట్లు పెడుతుండగా... మరికొందరు 'ధనుష్ రూమర్స్ క్లోజ్... ఇప్పుడు సిద్ధాంత్ ఎంట్రీ!'అంటూ సరదాగా స్పందిస్తున్నారు. ఇక కొందరు నెటిజన్లు మాత్రం ఇది పూర్తిగా సినిమా ప్రమోషన్‌లో భాగమేనని అభిప్రాయపడుతున్నారు.

డేటింగ్ రూమర్స్... కానీ క్లారిటీ ఇదే
మృణాల్-ధనుష్ మధ్య రిలేషన్ ఉందంటూ గతంలో పెళ్లి వరకూ వెళ్లొచ్చన్న గాసిప్స్ కూడా వినిపించాయి. అయితే వాటన్నింటినీ మృణాల్ టీమ్ ఖండిస్తూ.. ఇది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే అని స్పష్టం చేసింది. ఇప్పుడు సిద్ధాంత్‌తో కనిపిస్తున్న క్లోజ్‌నెస్ కూడా అదే ప్రమోషనల్ స్ట్రాటజీ కావొచ్చన్న మాట వినిపిస్తోంది.

సినిమాల ప్రమోషనా? లేక నిజమైన కెమిస్ట్రీనా?
'దో దీవానే షెహర్ మేన్' సినిమా సాధారణ లవ్ స్టోరీలా కాకుండా... నిజ జీవిత ప్రేమలో కనిపించే భావోద్వేగాలు, లోపాలను చూపించడమే లక్ష్యంగా రూపొందినట్లు మేకర్స్ చెబుతున్నారు. అందుకే ప్రమోషన్స్‌లో కూడా హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పూల వర్షం వీడియో వైరల్ కావడంతో ఈ ప్రచారానికి మరింత బూస్ట్ వచ్చిన మాట నిజం.

ప్రస్తుతం దీనిపై మృణాల్ గానీ, సిద్ధాంత్ గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ ఒక వీడియోతోనే ఇంత డిస్కషన్ మొదలవడం చూస్తే... మృణాల్ క్రేజ్ ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైంది. మొత్తానికి ధనుష్ రూమర్స్ ఇంకా పూర్తిగా చల్లారకముందే... సిద్ధాంత్ పూల వర్షం ఎపిసోడ్ కొత్త చర్చకు తెరలేపింది. ఇక ఈ వైరల్ జంట నిజంగా ప్రేమలో ఉందా? లేక ఇది పూర్తిగా ప్రమోషనల్ ట్రిక్‌నా? అన్నది కాలమే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X